వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అయినా కమ్మ నాయకులను గెలిపించుకోవాలని ఆ సామాజికవర్గం భావిస్తోంది. ఈ క్రమంలో అన్ని పార్టీలను కమ్మలకు రెండు టికెట్లు ఇవ్వాలని కోరుతోంది. మల్కాజ్ గిరితో పాటు, ఖమ్మం లోక్ సభ సీట్లుకమ్మలకే కేటాయించాలని నాయకులు కోరుతున్నారు.
మల్కాజ్‌గిరి, ఖమ్మం స్థానాలను కాంగ్రెస్ పార్టీ కమ్మలకే కేటాయించాలని ఆ సామాజికవర్గం నేతలు కోరుతున్నారు. ఈమేరకు ఇప్పటికే ఆ పార్టీ ప్రతినిధులకు విన్నవించారు. అయితే ఖమ్మం స్థానానికి ఇప్పటికే భట్టి విక్రమార్క భార్య, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తమ్ముడు పోటీ పడుతున్నారు. రేణుకాచౌదరి కమ్మ నేత అయినప్పటికీ ఆమెకు రాజ్యసభ టికెట్ ఇచ్చారు. దీంతో లోక్ సభ టికెట్ కూడా కమ్మలకే ఇవ్వాలనే డిమాండ్ను తెరపైకి తెచ్చారు.
కానీ కాంగ్రెస్ ఆ ప్రతిపాదనను పట్టించుకోవడం లేదు. మల్కాజ్‌గిరి లోక్ సభ నియోజకవర్గం దేశంలోనే అతిపెద్దది. ఇక్కడ ఉత్తరాది ప్రజలతోపాటు, ఆంధ్రా సెటిలర్స్ ఎక్కువగా ఉంటారు. మినీ ఇండియాగా గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి కమ్మ నేతలకు టికెట్ ఇస్తే ఈజీగా గెలుస్తారని భావిస్తున్నారు. అందుకే మల్కాజ్‌గిరి టికెట్ కూడా అడుగుతున్నారు.కాంగ్రెస్‌కు ఇక్కడ బలమైన నాయకుడు లేడు. దీంతో కమ్మ నేతకు టికెట్ ఇస్తే గెలిపించుకుంటామని ఆ సామాజికవర్గం నేతలు కోరుతున్నారు.