పాదయాత్రకు ఊహించనంతగా విశేష స్పందన

రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పు వస్తోంది
2023లో బీజేపీ అధికారంలోకి రావాలని జనం కోరుకుంటున్నరు
అంచనాలకు మించి జనం రావడంతో ఏర్పాట్ల విషయంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తుతున్నాయి
వాటిని అధిగమించేందుకు పాదయాత్ర కమిటీలు కృషి చేయాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
( మధు పసునూరు)

ప్రజా సంగ్రామ యాత్రకు అంచనాలకు మించి జనం వస్తున్నారని, తాము ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా విశేష స్పందన లభిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో పాదయాత్ర విప్లవాత్మకమైన మార్పులు తెస్తోందని చెప్పారు. 2023లో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, అందుకే పాదయాత్రను విశేషంగా ఆదరిస్తున్నారని తెలిపారు. 11 రోజుల పాదయాత్ర తీరుతెన్నులు-ఏర్పాట్లు-ఎదురవుతున్న సమస్యలపై బండి సంజయ్ కుమార్ ఈరోజు ఉదయం సంగారెడ్డిలో తాను బస చేసిన ప్రాంతంలో పాదయాత్ర కమిటీల సభ్యులతో సమావేశమయ్యారు.
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మంత్రి శ్రీనివాసులు, దుగ్యాల ప్రదీప్ కుమార్, పాదయాత్ర ప్రముఖ్ మనోహర్ రెడ్డి, సహ ప్రముఖ్ లు తూళ్ల వీరేందర్ గౌడ్, లంకల దీపక్ రెడ్డి హాజరైన ఈ సమావేశంలో పాదయాత్రకు సంబంధించిన 30 కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ఏమన్నారంటే…
మీ అందరి కృషివల్లే పాదయాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. అందుకు ప్రధాన కారణం పాదయాత్ర కమిటీ సభ్యులే. నేను ప్రజా సమస్యలపైనే ద్రుష్టిని సారించి పాదయాత్ర చేస్తున్న. ఏ ఇబ్బంది లేకుండా నన్ను నడిపిస్తోంది మీరే.
అయితే పాదయాత్రకు అంచనాలకు మించి ఊహించని జనం వస్తున్నారు. విశేష స్పందన లభిస్తుండటంతో ఏర్పాట్ల విషయంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతున్నాయి. పాదయాత్ర కమిటీ సభ్యులు మరింత కష్టపడి పనిచేస్తే వాటిని అధిగమించవచ్చు.
తెలంగాణ ప్రజలంతా 2023లో బీజేపీని గెలిపించాలనే భావనకు వచ్చారు. పాదయాత్ర చేసిన జిల్లాల్లో పార్టీ మరింత బలోపేతమవుతోంది. యువకులు స్వచ్ఛందంగా తమ తమ గ్రామాల్లో కాషాయ జెండాలు పట్టుకుని బీజేపీలో చేరుతుండటం సంతోషంగా ఉంది.
ప్రజా సంగ్రామ యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పు తెస్తోంది. ఈ విషయం ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం ముఖ్యమంత్రికి సమాచారం ఇఛ్చాయి. అందుకే కేసీఆర్ భయపడి ఢిల్లీకే పరిమితమైండు.
పాదయాత్ర తీరుతెన్నులపై బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రత్యేకంగా ద్రుష్టి సారించింది. యాత్రను ప్రోత్సహిస్తూ అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తోంది. కష్టపడి పనిచేసే పాదయాత్ర కమిటీ సభ్యులను తప్పనిసరిగా తగిన విధంగా గౌరవిస్తాం. ప్రధాని నరేంద్రమోదీ, జేపీ నడ్డా, అమిత్ షా స్పూర్తితో మరింత కష్టపడి పనిచేసి పాదయాత్రను కనీవినీ ఎరగని రీతిలో విజయవంతం చేయాలని కోరుతున్న.

Leave a Reply