వైకాపా విశాఖ‌ని అఘాయిత్యాలకి కేపిట‌ల్ చేసింది

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

పాపాల పాల‌కులు ప్ర‌శాంతమైన‌ విశాఖ పాలిట శాపంగా మారారు. రాజ‌ధాని చేస్తామ‌ని విశాఖ న‌గ‌రాన్ని నేరాలు-ఘోరాల‌కి అడ్డా చేశారు. విశాఖ‌లో బాలిక‌పై గ్యాంగ్ రేప్ రాష్ట్రంలో భ‌యాన‌క ప‌రిస్థితుల‌కు అద్దం ప‌డుతోంది. సీఎం ఇంటిప‌క్క‌నే యువ‌తిపై గ్యాంగ్ రేప్ జ‌రిగితే నేటివ‌ర‌కూ నిందితుడ్ని ప‌ట్టుకోలేదు. టిడిపి పాల‌న‌లో ఆర్థిక‌రాజ‌ధానిగా విశాఖ‌ని ప్ర‌మోట్ చేశాం. వైకాపా విశాఖ‌ని అఘాయిత్యాలకి కేపిట‌ల్ చేసింది. రాక్ష‌స పాల‌న‌లో ర‌క్ష‌ణ‌లేని బాలిక‌లు, మ‌హిళ‌లకు మీ కుటుంబ‌స‌భ్యుడిగా నాదో విన‌తి. మూడు నెల‌ల పాటు జాగ్ర‌త్త‌గా ఉండండి. నేర‌గాళ్ల రాజ్యం అంతం అవుతుంది, ప్ర‌జాప్ర‌భుత్వం వ‌స్తుంది, మీ ర‌క్ష‌ణ బాధ్య‌త తీసుకుంటుంది.

Leave a Reply