వేద శాస్త్ర విద్వాంసులు తెలుగువారు గర్వించదగ్గ జ్ఞాననిధి ముదిగొండ శంకరశర్మ శంకర జయంతి రోజున శంకర భగవత్పాదుల్లో లీనమయ్యారు. నిన్నటిదాకా గుంటూరులో ని సంపత్ నగర్ లోని శృంగేరి శంకరమఠంలో శంకర జయంతి ప్రత్యేక ప్రవచనాలు అందించిన శంకరశర్మ కొంత అస్వస్థతకు లోనవగా హుటాహుటిన భాగ్యనగరానికి నిన్న విచ్చేసి ఆసుపత్రిలో చేరగా రాత్రి తుది శ్వాస విడిచినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి.
ముదిగొండ శంకర శర్మ నాన్నగారు బ్రహ్మవిద్యాలంకార ముదిగొండ వేంకట రామశాస్త్రి మహా పండితులు. మూడు తరాల శృంగేరి జగద్గురువులతో అత్యంత వాత్సల్యం కలిగినటువంటి శిష్యులు. అహం బ్రహ్మస్మి సంస్థ కు వారు వారి ఎనలేని జ్ఞానాన్ని ఉపన్యాసాల మూలంగా అందించారు. అనేక శిష్యులను భావి తరాలకు అందించారు.