– మంత్రి వాకిటి శ్రీహరి
హైదరాబాద్: ప్రపంచంలో ఉన్న పర్యాటక ప్రాంతాలను తలదన్నే పర్యాటక ప్రాంతాలు తెలంగాణలో ఉన్నాయి. వారంలో 6 రోజులు పని చేసిన ఒక్క రోజు అయినా పకృతిని మనం ఆస్వాదించాలి. పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చేసేలా ప్రభుత్వం కార్యక్రమాలు తీసుకుంటుంది.
కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ పర్యాటక రంగం పై ఆధారపడి ఉన్నాయి. మన దగ్గర సహజ సిద్ధమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నా చూపెట్టలేని పరిస్థితిలో ఉన్నాం. మా ప్రభుత్వం పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తుంది. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయటంలో భాగంగా ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఈ సెమినార్ నిర్వహించారు.
యువత తల్చుకుంటే ఏదైనా సాధ్యం అవుతుంది. రీల్స్ చేసే బదులు మన దగ్గర ఉన్న సహజ సిద్ధమైన పకృతి చూపెట్టేలా వీడియోలు చేయాలి. 33 జిల్లాల నుండి వచ్చిన విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. వారి తలుచుకుంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్న పర్యాటకాన్ని మన వెలుగులోకి తీసుకొని రావచ్చు.