Suryaa.co.in

Andhra Pradesh

పురందేశ్వరి ప్రశ్నలకు సమాధానం చెప్పలేని విజయసాయిరెడ్డి

– టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు

విజయసాయిరెడ్డి అవినీతి, నేరాలు చర్చనీయాంశాలయ్యాయి. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పలేని దుస్థితికి దిగజారాడు. ప్రశ్నించిన వారికి కులాలు, కుటిల రాజకీయాలు అంటగట్టే అలవాటు విజయసాయిరెడ్డిది. కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టడం, సిద్ధాంతాలు, నీతి నియమాలు గాలికొదిలేసి అడ్డదారులు తొక్కడం వైసీపీ నేతల సంస్కృతి. త్వరలో మూసేసే వైసీపీ కార్యాలయం ముందు ‘టులెట్‌’ బోర్డు పట్టుకోవడానికి విజయసాయిరెడ్డి సిద్ధంగా ఉండాలి.

ఇసుక, మద్యం, గనులు వంటి అనేక వ్యవహారాల్లో వైసీపీ పెద్దల అవినీతి, అక్రమాలను సాక్ష్యాధారాలతో ఎండగడుతున్నారని పురందేశ్వరిగారిపై వైసీపీ నేతలు పోటీపడి విషం చిమ్ముతున్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకోవడం, ప్రకృతి వనరులను మింగేయడం ఒకే కులానికి అన్ని పదవులు కట్టబెడుతూ, బడుగు బలహీనవర్గాలను వంచించడమే అజెండాగా సాగుతున్న జగన్‌రెడ్డి అరాచక పాలనను ప్రశ్నించడం నేరమా? నోరెత్తిన వారిపై కేసులు పెట్టడం, దుష్ప్రచారం చేయడం మీ నైజం కాదా?

LEAVE A RESPONSE