-వెన్నుపోటుదార్లకు రెప్యుటేషన్ ఉండదు బాబు
-బీసీ,ఎస్సీ,ఎస్టీ,పేద ఓసిలకు మేము సేవకులం
-చంద్రబాబు,లోకేష్ కు విజయసాయిరెడ్డి కౌంటర్
ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి రాజదానిని భ్రమల్లో ముంచాడని వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి,రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంపై వ్యక్తం చేసిన నాలుగు సందేహాలకు గురువారం అదే ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. టిడిపి ప్రభుత్వ హాయంలో ఏపీకి ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడులని చెప్పిన 400 ఒప్పందాలు బోగస్ అని చెప్పారు. చంద్రబాబు లాంటి వెన్నుపోటుదార్లకు రెప్యుటేషన్ ఉండదని వెల్లడించారు.తెలుగుదేశం పార్టీని చంద్రబాబునాయుడుని నమ్ముకున్న వాళ్లందరి భవిష్యత్తు చివరికి అంధకారమేనని అన్నారు.
టిడిపి నేత లోకేష్ ట్విట్టర్లో వైఎస్ఆర్ సిపి నాయకులపై చేసిన విమర్శలకు స్పందిస్తూ…. మేము బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, ఓసీ నిరుపేదలకు సేవకులం అని అన్నారు.
గతంలో తప్పుడు హామీలతో చంద్రబాబు నిరుద్యోగులను మోసం చేస్తే సీఎం జగన్ మోహన్ రెడ్డి లక్షలాది ఉద్యోగాలు కల్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారని తెలిపారు. చంద్రబాబు పాలనలో కల్పించిన శాశ్వత ఉద్యోగాలు కేవలం 34 వేలు మాత్రమేనని చెప్పారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటివరకు కల్పించిన 2.06 లక్షలు శాశ్వత ఉద్యోగాలు, 4.1 లక్షలు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, ఇతర ఉద్యోగాలు కల్పించారని,తాజాగా కోర్టుల్లో, పోలీస్ శాఖలో 10 వేల పోస్టుల భర్తీ జరుగుతోందని చెప్పారు.