బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత భరోసా
అమరావతి : నాయీ బ్రాహ్మణుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత స్పష్టం చేశారు. గురువారం తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను నాయీ బ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్ర కోటి సదాశివం కలిసి పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, నాయీ బ్రాహ్మణుల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. రూ.1000 కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరించామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.