— కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మోడీ ప్రకటించిన కమిటీ, వర్గీకరణ పై అధ్యయనం చేయడానికి కాదు. వర్గీకరణ ఎలా చేయాలి అనే టాస్క్ పెట్టిన ఫోర్స్ వంటిది.కేంద్ర ప్రభుత్వం చొరవతోనే సుప్రీం కోర్ట్ లో ఏడుగురు బెంచ్ ధర్మాసనం ఏర్పడింది. డిసెంబర్ 14 కల్లా అందరి అభిప్రాయాలకు గడువు ముగియనుంది. భారత ప్రభుత్వం వర్గీకరణ కు ఓకే అని కోర్ట్ కు సమాధానం ఇవ్వబోతున్నాం.
కమిటీ కోర్ట్ లో జరగనున్న దినసరి విషయాలపై కూడా దృష్టి పెడుతుంది. భారత ప్రభుత్వం వర్గీకరణ కు కట్టుబడి ఉంది. అమలు చేసే భాద్యత మాది. సుప్రీం కోర్ట్ లో అయినా, చట్ట సభల్లో అయినా ఏ విధంగా అయినా వర్గీకరణ సమస్య పరిష్కారం చేయనున్నాం.