Suryaa.co.in

Andhra Pradesh

జగన్‌ మాఫియా దోచుకున్న సొమ్ము మొత్తం కక్కిస్తాం

వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా కష్టమే-కేబినెట్‌లో 40 మంది మంత్రులు ఓడిపోతున్నారు
-ఘోర పరాజయం తప్పదు..జగన్‌ మాటల్లో ఓటమి భయం
-భారీ మెజార్టీతో కూటమి అధికారంలోకి రావడం ఖాయం
-అరాచక వైసీపీ నేతలు, అధికారులను జైలుకు పంపిస్తాం
-మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

జగన్‌ రెడ్డి మాటలే వైసీపీకి ఓటమిని స్పష్టం చేశాయని, దాన్ని కప్పిపుచ్చి కార్య కర్తలను మభ్యపెట్టేందుకు సజ్జల ప్రయత్నిస్తూ మీడియా ముందు అబద్ధాల ప్రచారాలకు తెరలేపాడని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం విలేఖరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. జగన్‌రెడ్డి మాటలను వైసీపీ కార్యకర్తలు నమ్మడం లేదు. నేడు పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేశారని ఏపీ గోబెల్స్‌ సజ్జల అసత్య ప్రచారానికి తెరలేపాడు. ముఖ్యమంత్రి లండన్‌ పారిపోతున్నాడు. పెద్దిరె డ్డి పీఎల్‌ఆర్‌ కంపెనీ వెహికిల్స్‌ ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు తరలిస్తున్నా రు. సజ్జల సొల్లు కబుర్లు ఎవరూ నమ్మరు. కేఏపాల్‌ కాన్ఫిడెన్స్‌ ఎలా ఉందో జగన్‌రెడ్డి కాన్ఫిడెన్స్‌ కూడా అంతేస్థాయిలో ఉందని సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ కూడా స్పష్టం చేస్తున్నాయి. ఇకనైనా పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని హితవుపలికారు.

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టే వైసీపీకి ఉరితాడు
ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టే వైసీపీని ముంచింది. తాత ముత్తాతలు ఇచ్చిన భూము లను కొట్టేయాలని, దోచుకోవాలని చేసిన చట్టమే వైసీపీకి ఉరితాడు అయింది. ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటు ఫలితమే జనసునామీ. వైసీపీ 40 మంత్రుల్లో ఒక్కరు కూడా దైర్యంగా మీడియా ముందుకు వచ్చి గెలుస్తామని మాట్లాడటం లేదు. వారందరూ ఓడిపోబోతున్నారు.

దాడులు ఆగలేదు..ఏం సమాధానం చెబుతారు
దివ్యాంగుడిపై దాడి చేసిన డీఎస్పీ చైతన్యను ఇంతవరకు ఎందుకు సస్పెండ్‌ చేయకుండా సీఎస్‌, డీజీపీలు కాపాడుతున్నారు. విశాఖలో మహిళల తలలు పగలకొట్టారు. పల్నాడులో సర్పంచ్‌ ఇంటిపై దాడిచేశారు. వీటికి ఈ జవహర్‌ రెడ్డి, సజ్జల, పోలీసు డిపార్ట్‌మెంట్‌ ఏమి సమాధానం చెబుతుంది. జగన్‌ రెడ్డి హింసకు కొమ్ముకాసిన అధికారులు ఈసీ చర్యలకు బలయ్యారు. మళ్లీ కూటమి పై అసత్య ప్రచారం చేస్తున్నారు.

జెండా ఎత్తిన సజ్జల
వైసీపీకి ప్రతిపక్ష కూడా హోదా దక్కదు. సజ్జల ఎత్తిపోయే మాటలు మాట్లాడు తున్నాడు. ఓటమి భయం సజ్జల కళ్లలో కనిపిస్తుంది. పిరికితనం కనిపిస్తుంది. జగన్‌ రెడ్డి లండన్‌ పోయి వస్తాడో లేదో అన్న సందేహం కూడా సజ్జల మాటల్లో కనిపిస్తుంది. సజ్జల భార్గవ్‌ రెడ్డి జెండా ఎత్తి హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. వైసీపీ సోషల్‌ మీడియా దుకాణం బంద్‌ అయింది. జగన్‌ మాటలతో కార్యకర్తలకు నమ్మకం రాకపోవడంతో నేడు సజ్జల మీడియా ముందుకు వచ్చి అసత్యాలు మాట్లాడుతున్నాడు.

ఓటమి భయంతో అరాచకాలు
తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని ఓడిపోతున్నామన్న ఫ్రస్టేషన్‌లో అరాచకాలు సృష్టించి టీడీపీ కార్యకర్తలు నాయకుల రక్తం చూసిన జగన్‌రెడ్డి, ఆయన తాబేదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ్‌రెడ్డి, జవహర్‌రెడ్డి, రఘురామి రెడ్డి, ఆంజనేయులు ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ సత్యనారాయణ వంటి అధికారులు, నాయకులు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద సిద్ధం పాటలు పెట్టుకుని డ్యాన్స్‌లు చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు పాస్‌ పోర్టులు, వీసాలతో పారిపోయే కార్యక్రమాల్లో ఉన్నారు.

ప్రజల్లో వచ్చిన చైతన్యంతో రాష్ట్రంలో సిద్ధం స్టికర్లు తీసేస్తున్నారు. వైసీపీ బ్యానర్లు తొలగిస్తున్నారు. దోపిడీ, అరాచక పాలనకు ఓటు రూపంలో చరమ గీతం పాడారు. ఓట్ల సునామీలో వైసీపీ కొట్టుకుపోతుంది. దీంతో సజ్జలకు కళ్లు బైర్లు కమ్మి పిచ్చి ప్రేలాపనలు కూస్తున్నాడు. జగన్‌ రెడ్డికి పిచ్చి పీక్‌ స్టేజ్‌కు వెళ్లిందని జగన్‌ రెడ్డి మాటలు చూసి జనం నవ్వుకుంటున్నారు. ఎన్ని మాయ మాటలు చెప్పినా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు.

ఈ ఆఫీసులో కుట్రలు
వైసీపీ గుండాల ఇళ్లలో పెట్రోలు బాంబులు పెట్టుకుని దాడులు చేస్తున్నారంటే వైసీపీ నేతలు ఏ విదంగా హింసను నమ్ముకున్నారో స్పష్టమైంది. వైసీపీకి ఓటమి ఖాయమని కూటమి గెలిస్తే కటకటాల్లోకి పోవాల్సి వస్తుందని ఎలక్షన్‌ షెడ్యూల్‌ వచ్చే ముందే రఘురామిరెడ్డి ఏ విధంగా ఫైళ్లు తగలబెట్టాడో, నేడు ఈ-ఆఫీసులో కీలక డాక్యుమెంట్లు మాయం చేసేందుకు కుట్రలు చేస్తున్నారు.

LEAVE A RESPONSE