Suryaa.co.in

Andhra Pradesh

భూ మాఫియాను అంతం చేస్తాం

-చంద్రబాబు నిజాయతీపరుడు
-ఏపీకి చంద్రబాబు అవసరం ఉంది
-అభివృద్ధి కావాలంటే బాబు సీఎం కావాల్సిందే
-బీజేపీ ఉన్నంతవరకూ తెలుగును చావనివ్వం
-తిరుమల వెంకన్న పవిత్రతను కాపాడతాం
-మళ్లీ అమరావతిని రాజధానిని చేస్తాం
-రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తాం
-ధర్మవరం బహిరంగసభలో కేంద్రహోంమంత్రి అమిత్‌షా
-కూటమి సభకు పోటెత్తిన జనం
-సత్యకుమార్ విజయం ఖాయమన్న సంకేతాలు

ధర్మవరం: ‘ఏపీలో భూమాఫియాను అంతం చేస్తాం. రౌడీఇజాన్ని అణచివేస్తాం. బీజేపీ బతికున్నంత వరకూ తెలుగును చావనివ్వం. తిరుమల పవిత్రతను కాపాడతాం. గత ఐదేళ్లుగా ఏపీ అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. ఈ రాష్ట్రానికి చంద్రబాబు లాంటి విజనరీ సీఎం కావడం చాలా ముఖ్యం. అందుకే మేం ఆయనను కలుపుకొనిపోతున్నాం. విద్య, ఉద్యోగ, ఉపాథి కావాలంటే చంద్రబాబును సీఎం చేసుకోవలసిన అవసరం ఉంద’ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. ధర్మవరం బీజేపీ అభ్యర్ధి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విజయం కోసం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన అమిత్‌షా.. టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ సందర్భంగా ఆయన ఏపీలో కూటమిని గెలిపించాల్సిన అవసరాన్ని వివరించారు. కూటమిని గెలిపిస్తే రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అమరావతిని రాజధానిగా చేసేందుకే మేం మళ్లీ చంద్రబాబుతో జత కట్టాం అన్నారు.

‘చంద్రబాబును మేం నిశితంగా పరిశీలించాం. ఆయన నిజాయతీపరుడు. బాబు సీఎంగా ఉన్నప్పుడు మా కుటుంబానికి చెందిన వారు ఐటీ కంపెనీలో ఉద్యోగాలు చేశారు. అవన్నీ చంద్రబాబు తెచ్చినవే’నని ప్రశంసించారు.

కాగా అమిత్‌షా సభతో.. ధర్మవరంలో రాజకీయ పరిస్థితి మారిపోయే పరిస్థితి కనిపించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ అభ్యర్ధి సత్యకుమార్ విజయానికి అమిత్‌షా ప్రచారం బాటలు వేసిందని, నియోజకవర్గంలో ఆయన పలుకుబడిని చాటిందని విశ్లేషిస్తున్నారు. ధర్మవరం సభకు అంచనాలకు మించి జనం హాజరవడం కూటమిలో సమరోత్సాహం నింపింది.

LEAVE A RESPONSE