– కాంగ్రెస్ ప్రభుత్వంలో 4 మహిళలకు కీలకమైన మంత్రి పదవులు ఇస్తాం
– జగ్గారెడ్డి ఇష్యూ .. మా కుటుంబ సమస్య
– టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
మహిళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మై లఢీకి లడ్ సక్తా హు కార్యక్రమంలో భాగంగా ఇందిరా భవన్ లో చేపట్టిన కార్యక్రమంలో ప్రసంగించిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. సమావేశానికి అధ్యక్షత వహించిన మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావ్..
రేవంత్ రెడ్డి కామెంట్స్…
ప్రియాంక గాంధీ గారు చేపట్టిన శక్తి యాత్రలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. మహిళలను మెసమికరించి పోరాటం చేసేందుకు ఇది సంతోషకరమైన అంశం. కాంగ్రెస్ పార్టీ లో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఉంది.కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు అంతా మహిళలే.. ప్రతిభ పాటిల్ ను రాష్ట్రపతి చెందిన ఘనత కాంగ్రెస్ పార్టీది.
మహిళల వల్లనే తెలంగాణ సాకారం అయ్యింది.తెలంగాణ కేసీఆర్ వల్ల తెలంగాణ లో ఎక్కువ నష్టపోయింది మహిళలే. మొదటి ప్రభుత్వంలో ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వలేదు.రెండో దఫా ప్రభుత్వంలో కాంగ్రెస్ పోరాటంలో ఇద్దరికి మంత్రి పడవినిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 4 మహిళలకు కీలకమైన మంత్రి పదవులు ఇస్తాం.
జగ్గారెడ్డి ఇష్యూ పార్టీ దృష్టికి వచ్చింది
మా పార్టీ పెద్దలు జగ్గారెడ్డితో మాట్లాడుతున్నారు. జగ్గారెడ్డి మా నాయకుడు, మా అధిష్టానం అపాయింట్ మెంట్ కోరాడు. జగ్గారెడ్డికి మేమంతా అండగా ఉంటాం.
సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. గతంలో విహెచ్ పై కూడా ఇలాగే సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆరా తీస్తే కౌశిక్ రెడ్డి అనుచరుడని తేలింది.
జగ్గారెడ్డి ఇష్యూ .. మా కుటుంబ సమస్య.. అందరం కూర్చొని మాట్లాడుకుంటాం. పీసీసీ చీఫ్ గా కొన్ని నేను బయట మాట్లాటలేను .
జగ్గారెడ్డి నాకు వ్యక్తిగతంగా మంచి స్నేహితుడు. నేను రాజకీయాలకు రాకముందు కూడా జగ్గన్న నాకు పరిచయం ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకరావడానికి మేము అందరం కలిసి పనిచేస్తాం. సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్ట్ లు వచ్చాయని కుంగిపోవద్దు. మనం మానసికంగా కృంగిపోతే శత్రువులు మరింత విజృంభిస్తారు. ఇలాంటి విషయంలో మనోధైర్యంతో బలంగా ఉండాలి. నాకు ఇలాంటివి సోషల్ మీడియా లో చాలా ఎదురయ్యాయి. జగ్గారెడ్డి విషయంలో పార్టీ పూర్తిగా అండగా ఉంటది.మేకపా
టి గౌతంరెడ్డి మరణం చాలా బాధాకరం. ఏపీ రాష్ట్రానికి తీరని లోటు అందరూ ఆ కుటుంబానికి అండగా ఉండాలి. నాకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడు.
గౌతమ్ రెడ్డి తండ్రి రాజమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేశారు.