Home » రాజకీయాల్లోకి వచ్చే ఎవరైనా….వచ్చాక….గెలిచే ముందు వరకూ ఏమని చెప్తారు…

రాజకీయాల్లోకి వచ్చే ఎవరైనా….వచ్చాక….గెలిచే ముందు వరకూ ఏమని చెప్తారు…

ప్రజల కోసం…ప్రజల చేత…ప్రజల వద్దకు…
అన్ని వాళ్ళ కోసమే అని చెప్తారు…
గెలుస్తారు…
అధికారం వచ్చాక పరిస్తితులు మారతాయ్…
కొంతమేరకు మార్పు కూడా వస్తుంది…
స్వార్థం…అధికార లాలూచీ…సమూహాన్ని తృప్తి పరిచే క్రమం లో….అవినీతి…అక్రమాలు పెరగడం…
సీట్ కాపాడుకునే క్రమం లో అభద్రత పెరగడం…
పాలన… దాని వల్ల మేలు, కీడు….ప్రజల్లో అసంతృప్తి….
ఇన్ని రాజకీయాల మధ్య ప్రజలకి దూరం ఆవుతా వస్తారు…
అయితే……
తెలుగుదేశం… ఎన్టీఆర్….నాయుడు గారు….
ఎన్ని ఒడిదుడుకులు రాజకీయ పరంగా ఎదుర్కున్న..
ప్రజలకి దూరం కాలేదు…ప్రజల కి మేలు చేయడం అనే టీడీపీ స్థాపక సిద్ధాంతాన్ని మర్చిపోలేదు…
దాని కోసం ఎలాంటి వారి నైనా ఎదిరించారు….
అందుకే వీళ్లిద్దరిని ఓడించాలంటే మొత్తం దేశం లో ఉన్న కుళ్లు రాజకీయాలు….వాటి అధ్యక్షులు…
వ్యవస్థలు…పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి అమ్ముకుపోయే పార్టీ లు..కులం…ప్రాంతం ఆధార విద్వేషాలు….కొన్న మీడియా ద్వారా విష ప్రచారం…
ఇలా ఇంత భారీ స్కెచ్ లు వెయ్యాలి….
ఒక ప్రాంతీయ పార్టీ నలభైళ్ళు ఇంకా బలంగా….గర్వం గా నిలబడడానికి కారణం ఏంటి…
పార్టీ లోకి వచ్చిపొయ్యే నాయకులు….మోసం చేసిన నాయకులు… లేదా ఆయనేదో రాజకీయాలు చేయలేదని…మాకు మేలు చేయలేదని ఏడ్చే కొంతమంది….అభివృద్ధి ని మాత్రమే చూశారు…
రాజకీయాలు చేయడం మర్చిపోయారు అనే జోకులు…ఇవా…
కాదు…
ప్రజల తో ముడి పడ్డ రాజకీయమే…
ఆయన్ని…ఆయన ద్వారా పార్టీ ని ఇంత నిటారు గా నిలబెట్టింది…
ఇప్పటికీ మేం చేసాం అని కాదు..
మేమే చేశాం…మేమే చేయగలుగుతాం అని ఆధారాలు చూపించి బలంగా చెప్పగలిగే గర్వం ఒక్క టీడీపీ కి మాత్రమే సొంతం……
కనుమరుగై పోయిన ప్రాంతీయ పార్టీ లు….
అధికారం లేకపోతే పేకమేడ లా కుప్పకూలే పార్టీ లు…
విద్వేషం…కసి తప్ప రాజకీయానికి… పార్టీ కి కనీసం పేరు కూడా అర్హత లేని ఒక్క చాన్స్ అని నమ్మిస్తే బంగాళాఖాతంలో మునిగే పార్టీ ల మధ్య…..
ఇంకా పసుపు జండా ని గర్వంగా పట్టుకొడమే కాదు…
అన్ని అడ్డంకుల మధ్య పైశాచికం….
నాయకుడిని నడిపించి చీకటి సృష్టిస్తే…..టెక్నాలజీ వెలుతురు లో ఆయన పోరాట గళాన్ని….
దేశమంతా తెలియజెప్పిన నిస్వార్థ పసుపు సైనికులు
నమ్మేది ఆ సిద్ధాంతాన్నే…..
40 ఏళ్ల పార్టీ ని నడిపిస్తున్న నాయకుడి కి…
నిన్న గర్వం కాకుండా….అహంకారం ఉండి…. అహం అడ్డుపడ్డట్టయితే….. ఆయనే ఒక్క పిలుపు ఇచ్చింటే…. అక్కడేం జరిగేదో మొత్తం దేశం చూసేది……
ఆయన దాకా ఎందుకూ…
అంత రెచ్చగొడతన్నా…ఇబ్బందులు పెడతన్నా యువ నాయకుడు తొందర పడ్డారా….
ఈ నాలుగేళ్ళ లో చాలామంది కోరుకునేది ఇదే….
Instance…. అప్పటికప్పుడు ఏదో జరిగిపోవాలి…
తర్వాత ఏమవుతుందో తెలుసా….
నాయకుడి గా నాయుడు కి తెలుసు…
అందుకే ..
అదే గళం తో ….ఓర్పు తో పైశాచికాన్ని తూర్పార బట్టారు…..ఆలోచించుకునే అవకాశం ప్రజలకి ఇచ్చారు…..
ఈ ప్రజలింతే అని ప్రతిరోజూ మనం తిట్టుకుంటే…
ఇక ఆయన బయటికి రావడం…
రాజకీయాలు చేయడం…
రాజకీయాల్లో ఉండడం…
మనం మనకి ఒక ఎజెండా ఉందనుకోవడం….
టీడీపీ ని అభిమానించడం అనవసరం…
ఆయనతో సహా ఎవరైనా ఏం జరిగితే అది జరుగుతుంది… మనకి నష్టమా అని ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు…
ఎందుకంటే చూసే మనకే వాళ్ళ మీద అంత కోపం వస్తే….అంత చేసిన ఆయనకి ఎంత కోపం రావాలి…
ఎక్కడైనా ప్రదర్శించారా….
అందుకే సైకో రాజకీయాలకి విసిగిపోయి…..
ఏదో హీరోయిక్ గా చూడటం….అదే కరెక్ట్ అనుకోడం…అది చేయలేదని బాధపడటం….
ఓట్లు అడగాల్సిన వాళ్ళని…ఓట్లు వేయాల్సిన వాళ్ళని అనడం మానేద్దాం….
రాజకీయాలకి స్వార్థం ఉన్నట్టే ఏ మనిషికైనా స్వార్థం ఉంటుంది………….
నిన్న అంత జరిగినా…..ఆయన స్థానం లో ఇంకొకరు ఉంటే……ఎంతో జరిగేది…
అయినా ఆయన ఒకే మాటన్నారు 8కిమీ నడిచాక…
చట్ట ప్రకారం శిక్షిస్తా అని…
ఇదీ చాలామంది కి నచ్చదు….
ఏమి చేయరు అని తీర్పులు….
అన్నీ అతగాడి లాగా చేసుంటే సీట్ కింద టైం బాంబ్ పెట్టుకుని రాజకీయ శాంతి లేని నిద్ర పట్టని నాయకుడి గా రగిలిపోతూ ఉండే వారు…..
అలా కాకుండా….
ఇంకా అంత గర్వంగా నిలబడి ..నిలబెడుతున్నారు అంటే….
ఆయన్ని….ఆయన రాజకీయాల్ని నమ్మి…ఆయన వెంట నడుస్తూ…ఆయన్ని ముందుకు నడిపిస్తున్న
అభిమానమే కారణం….
నిన్న అక్కడ ఉన్నది కేవలం టీడీపీ అభిమానమే కాదు….ప్రజాభిమానం కూడా..

– శ్రీనివాస్‌ కంకణాల

Leave a Reply