Suryaa.co.in

Telangana

బీర్ల ధరలు పెంచడం దేనికి సంకేతం?

-ఏపీ,తెలంగాణ ఒక్కటై బీర్ల ధరలు పెంచారా?
– ఏపీ,తెలంగాణ రాష్ట్రాలను మద్యం మాఫియా నడిపిస్తోంది
– కొద్ది రోజుల్లో బ్రాందీ,విస్కీ ధరలు పెరుగుతాయి
– ఏపీ ప్రభుత్వం చెప్తే ధరలు పెంచారా ?
– మాజీ మంత్రి వి .శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: బీరుకు 30 నుండి 40 రూపాయలు ధర పెంచారు. బి ఆర్ ఎస్ హయాంలో నామమాత్రపు ధర పెంచితే గగ్గోలు పెట్టారు. బీర్ల ధరలు పెంచడం దేనికి సంకేతం? నాణ్యతలేని బీర్లు తీసుకువస్తున్నారు. బెల్టు షాపులు బంద్ చేస్తామని ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి చెప్పారు. ఏపీ,తెలంగాణలో ఒకే సారి ధరలు పెంచారు ఏపీ,తెలంగాణ రాష్ట్రాలను మద్యం మాఫియా నడిపిస్తోంది.

ఏపీ,తెలంగాణ ప్రభుత్వాలు ఒప్పందంతో నడుస్తున్నాయి. రాహుల్ గాంధీ ప్రకటించిన డిక్లరేషన్లు అమలు అవుతున్నాయో తెలుసుకోవాలి. హోంగార్డులకు ఇప్పటి వరకు జీతాలు లేవు. హోంగార్డులకు జీతాలు పెంచి కేసీఆర్ వారికి గౌరవం ఇచ్చారు. పోలీసుల స్థాయికి హోగార్డులను కేసీఆర్ తీసుకువెళ్లారు.రిటైర్మెంట్ అవుతున్నామని ప్రభుత్వ ఉద్యోగులు భయపడుతున్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్కరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదు వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వడానికి భయపడుతున్నారు. ఆర్టీసీ పరిస్థితి రోడ్ల మీదకు వచ్చింది. కార్పోరేషన్లకు 50 రూపాయలు ఇవ్వలేదు. హాస్టళ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. వరంగల్ డిక్లరేషన్మలు కాలేదు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి గుండు సున్నా వచ్చింది. హోంగార్డులను వెంటనే పర్మినెంట్ చేయాలి.

యూనిఫామ్ సర్వీసులో ఉన్న వారు తెలంగాణ గురించి కొట్లాడారు.. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసి లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలి. బీసీలకు 42 శాతం చట్టపరమైన రిజర్వేషన్లు ఇవ్వాలి.బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వేను బయటపెట్టండి. కులగణన రీసర్వే చేయాలి. 421 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

ఇందిరాపార్కు వద్ద హోగార్డులతో ధర్నా చేస్తాము. సర్వశిక్షా అభియాన్ లో పనిచేసే వారిని ఛాయ్ తాగేలోపు పర్మినెంట్ చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. బీర్ల ధరలు ఎవరు చెప్తే పెంచారు? కొద్ది రోజుల్లో బ్రాందీ,విస్కీ ధరలు పెరుగుతాయి..ఏపీ ప్రభుత్వం చెప్తే ధరలు పెంచారా? ఏపీ,తెలంగాణ ఒక్కటై బీర్ల ధరలు పెంచారా?

తెలంగాణ ఉద్యమంలో సర్వీస్ కోల్పోయారని మా హయాంలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచాము ఇప్పుడు రిటైర్మెంట్ వయసు పెంచాలని ఉద్యోగులు కోరుకోవడం లేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగులకు జీతాలు ఇచ్చాము.

LEAVE A RESPONSE