– విద్యార్థులకు స్కూటీలు ఇవ్వమని సీతక్క,కొండా సురేఖ ఎందుకు అడగరు?
– బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్: రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థను గాడిన పెట్టలేదు. ఉమ్మడి రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు విద్యా శాఖ మంత్రి లేని క్యాబినెట్ ఇదే. విద్యా శాఖను రేవంత్ రెడ్డి తనవద్ద పెట్టుకున్నారు. రాష్ట్రంలో 50మంది గురుకుల విద్యార్థులు పాఠశాలల్లో చనిపోయారు.
ప్రియాంక గాంధీ చేత యూత్ డిక్లరేషన్ప్రకటించారు. విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని మోసం చేశారు.విద్యార్థులకు స్కూటీలు ఇవ్వమని మహిళా మంత్రులు సీతక్క,కొండా సురేఖ ఎందుకు అడగరు? ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డు అన్నారు. ఇప్పటి వరకు విద్యా శాఖపై రేవంత్ రెడ్డి రివ్యూ చేయలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫీజు రియంబర్స్ మెంట్ ఇస్తామని చెప్పారు. ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉన్న కోదండరాం ఎందుకు మౌనంగా ఉన్నారు?
ఆకునూరి మురళీ ఎందుకు ప్రభుత్వ పాఠశాలల్లో పర్యటించడం లేదు?మహిళా కమీషన్ చైర్మన్ కార్పొరేట్ కళాశాలల్లో పర్యటించి వారి తీరుపై
ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ హయాంలో కోదండరాం కాలుకు బలపం కట్టుకుని తిరిగారు. జాబ్ క్యాలెండర్ ను ఫాలో కావడం లేదు. వంద రోజుల్లో లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు వెంటనే విద్యాశాఖా మంత్రిని నియమించాలి.
రాష్ట్రంలో కార్పోరేట్కాలేజీల దోపిడీ ఎక్కువ అయిపోయింది. హైదరాబాద్ నడిబొడ్డున అనేక కార్పోరేట్ కాలేజీలకు పర్మిషన్స్ లేవు. కాలేజీల్లో బౌన్సర్లను పెట్టుకుని కాలేజీ యాజమాన్యాలు దాడి చేస్తున్నాయి. ప్రయివేటు కార్పోరేట్ కాలేజీలపై రేవంత్ రెడ్డి నోరు విప్పాలి. చిన్న,చిన్న కాలేజీలపై ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. కార్పొరేట్ కాలేజీలు ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేస్తున్నారు.