ఉమ్మడి పౌరస్మృతి వద్దు, షరియా కావాలని ముస్లిం మతపెద్దలు వాదిస్తుంటారు. అసలు షరియా అంటే ఏంటి మరి? ఇస్లాం మతం పాటించే వారు ఏర్పరచుకున్న సొంత న్యాయవ్యవస్థనే షరియా అంటారు. షరియా అంటే అర్థం చట్టం. అరబ్బీలో దీనికి అర్థం మార్గం.
ఖురాన్‌లో చెప్పినవి, మహ్మద్ ప్రవక్త ప్రవచనాలు, మత పెద్దల బోధనల ద్వారా దీన్ని రూపొందించారు. అయితే ఇది రాతపూర్వక నియమావళి మాత్రం కాదు. మతాన్ని ఎలా ఆచరిం చాలి, ప్రవర్తనా నియమాలు, చట్టపరమైన విషయా లను ఎలా ఆచరించాలి? అనేవి ఇందులో ఉం టాయి.
షరియా ప్రకారం ముస్లింలందరూ రోజుకు అయిదు సార్లు ప్రార్థన చేయాలి. అయితే ప్రార్థన చేయనందుకు ఖురాన్‌లో ఎలాంటి శిక్షలు లేవు. అయినప్పటికీ ముస్లిం దేశాల్లో కఠినంగానే ఆచరిస్తారు. జంతు మాంసం తినాలంటే కచ్చితంగా హలాల్ చేయాలి. ముస్లింలు బ్రహ్మచర్యాన్ని పాటిం చడం, సన్యసించడం నిషేధం. నిఖా (వివాహం) తప్పనిసరి. ఇది జరగకుంటే ఇస్లాంలో చట్టబద్ధత ఉండదు.
ముస్లింలు నిరభ్యంతరంగా విందులూ, వినోదాలకు (పార్టీలు) హాజరు కావచ్చు. కానీ పొగ తాగడం, మద్యపానం, మాదక ద్రవ్యాలు తీసుకోకూడదు. పార్టీలకు వెళ్లినప్పుడు పురుషులు ఇతర కుటుంబాలకు సంబంధించిన మహిళలతో మాట్లాడకూడదు. మహిళలు శరీరమంతా కప్పే వస్త్రాలు, హిజాబ్ లేదా బుర్ఖా ధరించాలి. ముస్లింలు తమకిష్టమైన విద్యనభ్యసించవచ్చు. మహిళలు బయటకు వెళ్లాలంటే మగవారి తోడు తప్పనిసరి.
నేరం, శిక్ష
షరియా ప్రకారం నేరాలు (క్రిమినల్ లా) హద్, తాజిర్ అని రెండు రకాలు. దొంగతనం, వ్యభిచారం, మద్యపానం హద్ నేరాల జాబితాలోకి వస్తాయి. హద్‌లో హదూద్, ఖియాస్ అని రెండు రకా లుంటాయి. హదూద్ ప్రకారం అవయవాలు నరకడం, ఉరి తీయడం, రాళ్లతో కొట్టి చంపడం, కొరడాతో కొట్టడం లాంటి శిక్షలుంటాయి.
ఖియాస్ అంటే బాధితుడు, వారి వారసుల నిర్ణయానుసారం శిక్షలు అమలు చేయడం. వారు క్షమిస్తే శిక్షలకు బదులు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. తాజిర్ నేరాలకు న్యాయాధిపతి నిర్ణయం మేరకు శిక్షలు విధిస్తారు. మతమార్పిడిని ముస్లింలు నేరంగా పరిగణిస్తారు. షరియా చట్టం ప్రకారం ఈ నేరానికి మరణశిక్షే. కుటుంబం, వివాహం, వారసత్వం వంటివి వ్యక్తిగత చట్టం (పర్సనల్ లా) పరిధిలోకి వస్తాయి.
మధ్యయుగాల్లో ఏర్పరచిన షరియాను చాలా ఇస్లామిక్ దేశాలు తమ దేశ ప్రమాణాలకు అనుగుణంగా అమలు చేస్తున్నాయి. కొన్ని దేశాలు వీటిపై సమీక్షలు చేసి ఆధునిక కాలానికి అను గుణంగా మార్పులు చేస్తున్నాయి. మత పెద్దలతో చర్చించి వీటి విషయంలో నిర్ణయం తీసుకుంటారు. అయితే ప్రపంచంలోని 9 దేశాలు మాత్రమే పూర్తిగా షరియా ప్రకారం క్రిమినల్, పర్సనల్ న్యాయవ్య వస్థను అమలు చేస్తుండటం గమనార్హం..
జాగృతి సౌజన్యంతో