Suryaa.co.in

Features

తెలుగు మాగాణపు ధృవతార, కీర్తి పతాక!

– “చెరుకూరి రామోజీరావు”పత్రికా రంగంలో తిరుగులేని ప్రభంజనం!

తెలుగు భాష వైభవం, అక్షర సాగుదారుడు,సమాజ హితైషి, తన ప్రచురణల ద్వారా పాత్రికేయ రంగంలో నూతన ఒరవడి సృష్టించి,విలువల్ని స్థాపించి పత్రికారంగంలో ఆదర్శప్రాయంగా నిలిచి తెలుగు జాతి గర్వకారణంగా వెలుగొందారు. సంక్షోభ సమయంలో జాతిని జాగృతం చేసి సమస్యని పరిష్కారం చేసే అద్భుతమైన వైద్యుడు రామోజీరావు గారు‌!

ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి పేరు బాగుంటుంది పెట్టమని బుద్ద భగవానుడు నడయాడిన నేల,దేవతల రాజధాని, ఒకప్పుడు చారిత్రకంగా ఉన్నతంగా వర్థిల్లిన ప్రాంతం శుభకరంగా ఉంటుందని చంద్రబాబు గారికి సూచించి తెలుగు జాతి పట్ల తన మమకారాన్ని చాటుకున్న మహామనీషి మన రామోజీరావు గారు.

తెలుగుజాతి ఏమిచ్చినా ఆయన ఋణం తీర్చుకోలేనిది.ఆయన లేరన్న మాట వింటే హృదయం బరువెక్కి మాట పూడుకుపోయింది.

మళ్లీ జన్మంటూ ఉంటే భవిష్యత్తు తరాల బాగు కోసం, జాతి చైతన్యం కోసం రామోజీ గానే పుట్టాలని భగవంతుని ప్రార్థిస్తూ మీ ఆత్మకి శాంతి చేకూరాలని వైకుంఠ వాసంలో విష్ణుమూర్తి సన్నిధిలో మీరు సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ మీరు పునర్జన్మ పొందాలని కోరుకుంటూ అశ్రు నివాళులతో

– రమాదేవి గంగవరపు!

LEAVE A RESPONSE