Home » తెలుగుజాతి ముద్డుబిడ్డ రామోజీరావు

తెలుగుజాతి ముద్డుబిడ్డ రామోజీరావు

– సామాజిక బాధ్యత స్ఫూర్తి ప్రదాత
-మాజీ ఎంపీ కంభంపాటి రామమోహన్ సంతాపం

‘‘అతనొక నమ్మకం, అతనొక నిజాయితీ, అతనొక గెలుపు, అతనొక బాధ్యత, అతనొక స్ఫూర్తి, అతనొక అద్భుతం’’..
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు పరమపదించడం తెలుగుజాతికే కాదు, మొత్తం సమాజానికే తీరనిలోటు..అతి సామాన్య రైతుకుటుంబంలో పుట్టి స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన మేరునగధీరుడు రామోజీరావు..
60ఏళ్లుగా మార్గదర్శి, 50ఏళ్లుగా ఈనాడు, 40ఏళ్లుగా సినిమా నిర్మాణం, 30ఏళ్లుగా ఈ టీవీ, ఫిల్మ్ సిటీ, అనేక సంస్థలను విజయవంతంగా నిర్వహిస్తూ వేలాదిమందికి ఉపాధినిచ్చి, లక్షలాదిమందికి బతుకుతెరువు కల్పించి, కోట్లాది ప్రజల అభిమానాన్ని చూరగొన్న తెలుగుజాతి దిగ్గజం రామోజీరావు..

తానెంత అత్యున్నత స్థానానికి చేరినా తనమూలాలు మర్చిపోని నిరాడంబరుడు..సామాజిక బాధ్యతకు మారుపేరు..విపత్తుల్లో బాధితులకు అండగా నిలబడ్డ వదాన్యుడు, తాను భూరి విరాళాలివ్వడమే కాకుండా, తన సంస్థలతో విరాళాలు సేకరించి విపత్తు బాధితులకు పక్కాగృహాలుగా అన్నివసతులతో ‘‘సూర్య’’ భవనాలు నిర్మించి ఆదుకున్న ధన్యజీవి..

తెలుగు సంస్కృతీ వికాసం, తెలుగుభాషాభివృద్ధికి పాటుబడ్డ తెలుగుజాతి ముద్దుబిడ్డ.. సామాజిక బాధ్యత స్ఫూర్తిప్రదాత రామోజీరావు లేని లోటు నాకు వ్యక్తిగతంగా తీరనిది.
రామోజీరావుగారి కుటుంబ సభ్యులకు, ఈనాడు-ఈటీవీ, మార్గదర్శి, ఇతర సంస్థల ఉద్యోగులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.

Leave a Reply