ఎంత చిత్రమో ఈ జీవిత సత్యాలు?
పట్టీల విలువ వేల రూపాయల్లో… కాని వేసేది కాళ్ళకి..
కుంకుమ విలువ రూపాయలలో… కానీ పెట్టుకొనేది నుదుటిపైన..
విలువ ముఖ్యము కాదు.. ఎక్కడ పెట్టు కుంటామనేది ముఖ్యము..
ఉప్పులాగ కటువుగా మాట్లాడే వాడు నిజమైన మిత్రుడు…
చక్కెర లాగ మాట్లాడి మోసగించే వాడు నీచుడు.
ఉప్పులో ఎప్పుడూ పురుగులు పడ్డ దాఖలాలు లేవు..
తీపిలో పురుగులు పడని రోజూ లేదు.
హే మానవా ! ఈ జీవితం అంత విలువైనదేమి కాదు..
ఏడుస్తూ ఈ లోకంలో అడుగిడుతావు.
ఏడిపిస్తూ ఈ లోకాన్ని వదలి వెళ్ళిపోతావు..
రమ్మన్నా సన్మార్గములోకి యెవ్వరు రారు..
వద్దన్నా చెడు మార్గమున్నే యెంచుకుంటారు.
పాలు అమ్మేవాడు ఇల్లిల్లు తిరగాలి..
సారాయి అమ్మేవాడి దగ్గరికే అందరు వెళతారు.
పాలల్లో నీళ్ళు కలిపినావా అని అడుగుతారు..
ఖరీదైన సారాయిలో నీళ్ళు కలిపి తాగుతారు.
ఆహాహా యేమి ఈలోకం..!
పెళ్ళి ఊరేగింపులో బంధు మిత్రులు ముందు.. వరుడు వెనకాల
శవయాత్రలో శవము ముందు.. బంధు మిత్రులు వెనకాల
శవాన్ని ముట్టి నందుకు స్నానం చేస్తారు.
మూగ ప్రాణులను చంపి భుజిస్తారు
కొవ్వొత్తులను వెలిగించి చనిపోయిన వారిని గుర్తు చేసుకొంటారు.
కొవ్వొత్తులను ఆర్పి జన్మ దినాన్ని ఆచరిస్తారు..
హే మానవా !ఏంటి ఈ వింత ప్రవర్తన?
– పట్టాభిరాముడు