Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ చేసింది విశాఖ గర్జనకాదు… జగన్ రెడ్డి భజన

• బస్సులుపెట్టి, డబ్బులిచ్చి, అధికారంతో బలవంతంగా ప్రజల్ని తరలించినా విశాఖ గర్జన విజయవంతం కాలేదు.
• రాజధాని రైతుల పాదయాత్రకు జగన్ రెడ్డిభయపడుతున్నాడు కాబట్టే, అధికారబలంతో అడ్డుకుంటున్నాడు.
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

డ్వాక్రామహిళలు, అంగన్ వాడీ సిబ్బంది, ఆటోడ్రైవర్లు, వాలంటీర్, సచివాలయ సిబ్బందిని తరలించి వైసీపీ నిర్వహించింది విశాఖగర్జన కాదని జగన్ రెడ్డి భజన అని, అమరావతి రైతుల్ని అడ్డుకోవడానికి జగన్ చేస్తున్న తొట్టిరాజకీయాలకు అంతిమంగా ఆయనే బలవుతా డని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి కొల్లురవీంద్ర స్పష్టంచేశారు.

శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన వివరాలు ఆయన మాటల్లోనే … “వైసీపీ చేసింది విశాఖ గర్జన కాదు.. జగన్ రెడ్డి భజన. తొట్టి రాజకీయాలకోసం వైసీపీనేతలు రాష్ట్రాన్ని తాకట్టుపెడుతున్నారు. అమరావతే రాజధాని అని గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రకటించలేదా? ఇప్పుడు కేబినెట్లో ఉన్న మంత్రులు, వైసీపీనేతలు అందుకు ఒప్పుకోలేదా? జగన్ రెడ్డి ఏదంటే దానికి తందానాఅంటారా? రాష్ట్రంకోసం భూములిచ్చిన రైతులు సర్వం కోల్పోయి రోడ్లెక్కితే అవహేళన చేస్తారా? చంద్రబాబుగారి హాయాంలో ప్రారంభమైన రాజధాని పనుల్ని ఆపేసిన జగన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం చివరకు ఉత్తరాంధ్రలో భూదోపిడీకి తెరలేపింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏనాడైనా విజయసాయి రెడ్డి పార్లమెంట్ లో గర్జించాడా?

ప్రత్యేకహోదా, రైల్వేజోన్, విభజనచట్టంలోని హామీల అమలుకోసం ఏనాడైనా జగన్ తనఎంపీలతో ప్రధాని ముందు గర్జించాడా? గర్జనపేరుతో బలవంతంగా డ్వాక్రా మహిళల్ని, అంగన్ వాడీసిబ్బందిని, వాలంటీర్లు, సచివాలయసిబ్బందిని తరలించి ఏంసాధించారు? బస్సులుపెట్టి, డబ్బులిచ్చి అధికారం ఉపయోగించి తీసుకొచ్చిన వారితో గర్జనను విజయవంతం చేయగలిగారా? బొత్స, ధర్మాన, తమ్మినేని ఇతరవైసీపీనేతలు విజయసాయి దోపిడీ సామ్రాజ్యానికి కాపలా కాస్తున్నారు తప్ప, ఉత్తరాంధ్ర ప్రయోజనాలు పట్టించుకోవడంలేదు.వైసీపీనేతలు నిర్వహించిన సభ వరుణుడిప్రకోపంతో నీరుగారిపోయింది. అన్నివర్గాలు, కులాలు, మతాలవారు ప్రశాంతంగా నిర్వహించే విశాఖ నగరాన్ని రణరంగంగా మార్చారు. విశాఖనగరాన్ని అభివృద్ధిచేస్తాం.. ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తామంటున్న జగన్ రెడ్డి, మంత్రులు మాటల్ని ఎవరూ నమ్మేస్థితిలోలేరు.

హుద్ హుద్ తుఫాన్ ధాటికి దెబ్బతిన్నవిశాఖను బాగుచేయడానికి చంద్రబాబు గారు ఎంతశ్రమించారో అందరికీ బాగాతెలుసు. ఆయన హాయాంలో వేసిన భూగర్భ కేబుల్ పనులు ఎందుకు నిలిపేశారు. టీడీపీహాయాంలో చంద్రబాబు వేసిన రోడ్లుతప్ప, ఈ మూడేళ్లలో జగన్ రెడ్డి ఒక్క రోడ్డైనావేశాడా? ఒక్క ఐటీ కంపెనీ అయినా కొత్తగా తీసుకొచ్చాడా? 1000 సీట్లున్న ట్రిపుల్ ఐటీని 500సీట్లకు పరిమితంచేసింది జగన్ కాదా? గిరిజనభూములు బలవంతగా లాక్కొని బాక్సైట్ తవ్వుకోవడం, గంజాయి పండించడం తప్ప, ఐటీడీఏలకు రూపాయి అయినా ఇచ్చారా? 2019 ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

ప్రత్యేకహోదాపై ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చి, యువతను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన జగన్, ఇప్పుడు ఆ ఊసుఎత్తకుండా కులాలు, ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతున్నాడు. అధికారం ఉందన్న అహంకారంతో, తాను చేస్తున్న తొట్టి రాజకీయాలకు అంతిమంగా బలయ్యేది జగన్ రెడ్డే. వైసీపీనేతల్ని రెచ్చగొట్టి, వారిని రైతులపైకి ఉసిగొల్పి, కోర్టు అనుమతితో సాగుతున్న పాదయాత్రను అడ్డుకోవడం జగన్ రెడ్డి చేస్తున్న అతిపెద్ద తప్పు. పాదయాత్రకు భంగం కలిగించడానికే రోడ్ కమ్ రైలు వంతెనను మరమ్మతుల పేరుతో మూసేశాడు. రాజధాని రైతులపాదయాత్రను చూసి జగన్ రెడ్డి భయపడుతున్నాడు కాబట్టే, తనఅధికారబలాన్ని, తనతొత్తులను ఉపయోగించి, వారిని అడ్డుకుంటున్నాడు. ప్రజలమద్ధతుతో సాగుతున్న రైతులపాదయాత్ర కచ్చితంగా దిగ్విజ యమవుతుంది. వారుఎట్టిపరిస్థితుల్లోనూ అరసవెల్లి సూర్యనారాయణస్వామిని దర్శించు కునే తీరుతారు” అని రవీంద్ర స్పష్టంచేశారు.

LEAVE A RESPONSE