Home » బీజేపీ అధికారంలోకి రాగానే నూతన ‘స్పోర్ట్స్ పాలసీ’ని తీసుకొస్తాం

బీజేపీ అధికారంలోకి రాగానే నూతన ‘స్పోర్ట్స్ పాలసీ’ని తీసుకొస్తాం

– కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకుంటం
– కేసీఆర్ పాలనలో కనుమరుగైన క్రీడలు
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే నూతన క్రీడల విధానాన్ని తీసుకొస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. టీఆర్ఎస్ హయాంలో కబ్జాకు గురైన భూములన్నీ తిరిగి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు.

హైదరాబాద్ లోని ముషీరాబాద్ సమీపంలో బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ తన సోదరుడు కోవా శ్రీనివాస్ మెమోరియల్ పేరిట నిర్వహించిన షటిల్ టోర్నమెంట్ ను బండి సంజయ్

ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు…

ప్రభుత్వ భూమి కన్పిస్తే… కబ్జాలు చేస్తూ డబ్బులు దండుకుంటూ అపార్ట్ మెంట్లు నిర్మిస్తున్న ఈ రోజుల్లో కోవా శ్రీనివాస్ మెమోరియల్ ట్రస్ట్ పేరిట డాక్టర్ కె.లక్ష్మణ్ చేస్తున్న క్రీడలను ప్రోత్సహిస్తుండటం ఆనందంగా ఉంది. ఇతర పార్టీలకు, బీజేపీకి ఉన్న తేడా ఇదే… గెలుపోటములు సహజం.

ఈరోజు ఎన్నికలంటేనే వందల కోట్లు ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని మార్చేందుకు బీజేపీ క్రుషి చేస్తోంది. ఇందుకు ప్రజల సహకారం కూడా కావాలి. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన అవసరం మనందరిపైనా ఉంది.

మనిషి పుట్టుకైనా… చావైనా సమాజానికి స్పూర్తిదాయకంగా ఉండాలనేది నా అభిమతం. భవిష్యత్తులో మన విగ్రహం కూడా చౌరస్తా వద్ద ఉండాలంటే సమాజానికి స్పూర్తి దాయకమైన పనులు మనందరం చేయాలి. సమాజం కోసం త్యాగం చేయాలి. నేను, నా కుటుంబం అనే స్వార్ధాన్ని వీడాలి. నేను మాత్రమే బాగుండాలనే భావన ఏ మాత్రం సరికాదు.

నిరంతరం సమాజం, ప్రజలు స్మరించుకుని స్పూర్తిగా తీసుకోవాలంటే అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రాం, ఛత్రపతి శివాజీ, స్వామి వివేకానంద, వీర సావర్కర్ మాదిరిగా దేశం కోసం, సమాజం కోసం గొప్ప పనులు చేయాల్సిన అవసరం ఉంది.రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతలు మద్యం తాగిస్తూ హోలీ ఆడుతూ పండుగల స్పూర్తిని, హిందూ సంస్కృతిని దెబ్బతీస్తున్నారు. అలాంటి వారి విషయంలో హిందూ సోదరులంతా జాగ్రత్తగా ఉండాలి.

దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోంది. కానీ తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. క్రీడా మైదానాల్లేకుండా చేస్తోంది. నిర్బంధ విద్య పేరుతో పిల్లలను చదువుకే పరిమితం చేస్తూ క్రీడలపట్ల అవగాహన లేకుండా చేస్తోంది. ప్రభుత్వ భూములు కనబడితే టీఆర్ఎస్ నేతలు కబ్జా చేస్తున్నారు.

రాష్ట్రంలో ఈ విధానాన్ని మార్చాలి. క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే నూతన క్రీ డల విధానాన్ని అమలు చేస్తాం. క్రీడాకారులను ప్రోత్సహిస్తాం. స్పోర్ట్స్ కాంప్లెక్స్ లను నిర్మిస్తాం. ఆటల మైదానాలను ఏర్పాటు చేస్తాం. దీంతోపాటు కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటాం.

Leave a Reply