అధికారంలోకి రాగానే వాలంటీర్లకు మెరుగైన జీతభత్యాలు, సదుపాయాలు కల్పిస్తాం

-వాలంటీర్లపై బొజ్జల సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం
-రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు

శ్రీ కాళహస్తి నియోజకవర్గంలో ఉన్న కొందరు వాలంటీర్లు వైసీపీ ఎమ్మెల్యే, అభ్యర్ధి బియ్యపు మధుసూదన్ రెడ్డితో కుమ్మకై అరాచకాలు, ఆగడాలు చేస్తున్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలు, ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన వాలంటీర్లపై శ్రీ కాళహస్తి టీడీపీ అభ్యర్ధి బొజ్జల సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు కేవలం ఆయన వ్యక్తిగతం మాత్రమే.

మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లను కొనసాగించడంతో పాటు వారికి మెరుగైన సదుపాయాలు, జీతభత్యాలు కల్పిస్తామని గతంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇదే తెలుగుదేశం పార్టీ వైఖరి.

ప్రజా ప్రయోజన కార్యక్రమాలను గాలికి వదిలేసి వైకాపా చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అరాచకం చేస్తున్న వాలంటీర్లను తెలుగుదేశం పార్టీ సమర్ధించదు. ఇప్పటికే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి వైకాపా చట్ట వ్యతిరేకత కార్యక్రమాల్లో పాల్గొన్న 200 మందికి పైగా వాలంటీర్లు సస్పెండ్ అయ్యారు. వారిపై క్రిమినల్ కేసులు పెట్టారు. వారి భవిష్యత్ ను వారే పాడు చేసుకుంటున్నారు.

జగన్ రెడ్డికి అవినీతికి వత్తాసు పలికిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే జైలుకు వెళ్లినా పట్టించుకోలేదు. అలాంటిది వాలంటీర్లపై కేసులు పడితే పట్టించుకుంటారా? ఒక్క సారి కేసు పడితే వారి భవిష్యత్ అంథకారమే అని వాలంటీర్లు గ్రహించాలి. అందుకే వాలంటీర్లు చట్టవ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని కోరుతున్నాం.

Leave a Reply