వైసీపీ పార్టీ కోసం కాదు.. ప్రజల కొరకు పని చేయండి

– అధికారులకు ట్విట్టర్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు హితవు

మునిసిపల్, రెవిన్యూ, పోలీస్ అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో 27వ వార్డు ఉల్లాసపేట (శ్రీనివాస నగర్) లో 2001 లో పట్టాలు ఇచ్చిన స్థలంలో ఇళ్ళు నిర్మించుకొని పేదలు నివాసముంటున్నారు. స్థానికంగా జరుగుతున్న భూకబ్జాలను ఇక్కడి టీడీపీ కౌన్సిలర్ ప్రశ్నిస్తున్నారు అని, రాజకీయ కక్ష తో పేదల ఇళ్ళు పడగొట్టడానికి వచ్చారు. అక్రమ కూల్చివేతలను అడ్డుకున్న ఒక గౌరవ ఎమ్మెల్యే తో ప్రవర్తించే విధానం ఇదేనా?

పేద ప్రజల పక్షాన, న్యాయం వైపున నిలబడటమే ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు చేసిన నేరమా? నాడు దళిత డ్రైవర్ ను చంపి ఇంటికి డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ కి మీరు చేసిన రాచ మర్యాదలు, నేడు పేదల తరపున నిలబడ్డ టీడీపీ ఎమ్మెల్యే తో మీ ప్రవర్తన అన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే అధికారులు అందరూ మీ చర్యలకు, భవిష్యత్ లో న్యాయస్థానాల్లో జవాబు చెప్పాల్సి ఉంటుంది.