Suryaa.co.in

Telangana

ఎక్కడైతే గుడి కూల్చారో అక్కడే మళ్లీ నిర్మించాలి: వీహెచ్‌పీ

ఎక్కడైతే గుడి కూల్చారో అక్కడే మళ్లీ నిర్మించాలి: వీహెచ్‌పీ

విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఏం రామరాజు , విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి పుల్ల

సత్యనారాయణ ,రాజేశ్వర్ రెడ్డి బజరంగ్ దళ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చందర్, వీహెచ్‌పీ నగర అధ్యక్షులు శ్రీనివాస రాజు , బజరంగ్ దళ్, వి హెచ్ పి నగర, జిల్లా నాయకులు పాల్గొనడం జరిగినది
ఎం రామరాజు మాట్లాడుతూ ఫిలింనగర్లోని అభయాంజనేయ స్వామి దేవాలయం విషయంలో, గోషామహల్ స్టేడియంలో ఇచ్చిన మాటను బిల్డర్ నిలబెట్టుకోవాలని కోరారు ఏ విధంగా అయితే గోషామాల్ స్టేడియం లో చెప్పారో, దేవాలయం పూర్తిగా తమ ఖర్చులతో నిర్మించి ఇస్తానని మాట ఇచ్చి, ఈరోజు మాట తిప్పుతున్నాడు. ఎక్కడైతే కూల్చివేశారు పిన్ పాయింట్ స్థలంలో భవ్య అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని స్వామీజీల తో హిందూ ధార్మిక సంస్థలు అందరిని ఒక చోట తీసుకొని ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.

బజరంగ్ దళ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చందర్ మాట్లాడుతూ, జనవరి 4వ తారీఖున ఐదు వందల మంది పూజ సాధువు సంతులన కలుపుకొని వివిధ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో వేలాది మంది హిందువులతో , చలో ఫిలింనగర్ పేరుతో మరొక కరసేవ నిర్వహించి, అక్కడ భవ్య హనుమాన్ దేవాలయం నిర్మిస్తామని హెచ్చరించారు.జనవరి 4వ తేదీన జరిగే చలో ఫిలింనగర్ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి హిందువు పాల్గొని, భవ్య హనుమాన్ దేవాలయం నిర్మాణంలో పాల్గొని విజయవంతం చేయాలని యువతకు పిలుపునివ్వడం జరిగింది.

LEAVE A RESPONSE