Home » ప్రభుత్వం ఉన్మాదంపై ముస్లింలంతా ఐక్యంగా పోరాడాలి

ప్రభుత్వం ఉన్మాదంపై ముస్లింలంతా ఐక్యంగా పోరాడాలి

-మదరసాపై ప్రభుత్వ కక్షసాధింపులకు నిరసనగా ముస్లిం సంఘాల నేతలు రిలే దీక్షలు
– మైనార్టీ సెల్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్‌ అహమ్మద్‌

నంద్యాలలోని వక్ఫ్ బోర్డు స్థలంలో ఉన్న మదరసా అరబియా దారుల్ అమన్ అనే స్కూల్ పై ప్రభుత్వ కక్ష సాధింపులకు నిరసనగా మైనార్టీ సెల్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్‌ అహమ్మద్‌ ఆధ్వర్యంలో నంద్యాలలో రిలే దీక్షలు నిర్వహించారు.ఈ దీక్షలో ముస్లిం సంఘాలు పాల్గొన్నాయి.

ఈ సందర్భంగా మౌలానా ముస్తాక్ మాట్లాడుతూ మైనారీటీల అభ్యునతి కోసం, వక్ఫ్ భూముల రక్షణ కోసం ఏర్పాటైన వక్ఫ్ బోర్డు లో పనిచేసే అధికారులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. చదువుకునే పేద విద్యార్థులపైనా ఈ ప్రభుత్వం పగసాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు రిలే దీక్షలు కొనసాగుతాయని స్ఫష్టం చేశారు. ముస్లింలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం మొదటి నుండి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా ప్రవర్తించి, తమ మనోభావాలు దెబ్బతీస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ముస్లింలంతా ఐకమత్యంతో ప్రభుత్వ ఉన్మాదచర్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు.

Leave a Reply