గోదా దేవి/ ఆండాళ్ ఎవరు?

ఆండాళ్ జీవిత చరిత్ర
ఆండాళ్ జీవిత చరిత్ర దక్షిన భారత దేశం లో ప్రసిద్ది. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం శ్రీ ఆండాళ్ తమిలనాటి శ్రీవిల్లిపుత్తూర్ లోని వటపత్రశాయి మందిర తులసి వనం లో కలియుగ ఆది లో అనగా 93 సంవత్సరం లో అవతరించినది.
విష్ణుచిత్తులు(పెరియాళ్వార్) వారి పెంపకం
ఎలాగైతె జనక మహారాజుకి సీతాదేవి లభించినదో, విష్ణుచిత్తులవారికి (పెరియాల్వార్) శ్రీవిల్లిపుత్తూర్ నందనవనంలో ఆండాళ్ ఒక తులసి చెట్టు వద్ద లభించింది. తమిలంలో కోదై అనగా తులసి మాల అని అర్థం, కాబట్టి తండ్రి ఆమెను కోదా అని పిలిచేవాడు, క్రమేపి ఆపేరే గోదా గామారింది. తండ్రిపెంపకం లో ఆమె అత్యంతమైన కృష్ణ భక్తి తో పెరిగింది.
విష్ణుచిత్తులవారు ప్రతి రోజు తులసి మాలను తయారుచేసి ఒకబుట్టలో ఉంచి, తిరిగి తన కర్యక్రమాలు పూర్తి చేసుకొని ఆ మాలను దేవాలయానికి తీసుకొనివెళ్ళి వటపత్రశాయి మూర్తికి సమర్పించేవాడు. తండ్రిగారికి తెలియకుండా ఆమె రోజు ఆ మాలను దరించి తాను భగవంతున్ని వివాహము ఆడటానికి సరిపోవునా అని అద్దంలో చూసుకొని మురిసేది. కొద్దిరోజులకు తండ్రిగార్కి ఆ మాలలో ఒక వెంట్రుక కనిపించగా, గోదా ఆ మాలను దరించినదని గమనించి ఆమెను కోపించి, తనచే ఇన్ని రోజులు తప్పు జరిగిందని భావించి ఆ మాలను భగవంతునికి సమర్పించలేదు.
ఆశ్చర్యంగా ఆరోజు స్వప్నం లో స్వామి కనిపించి ఈరోజు తులసిమాలని ఎందుకు సమర్పించలేదని అడిగెను, తనకు భక్తులు తాకిన భహుమతులంటే ఇష్టం అని చెప్పెను. ఒక్కసారిగా విష్ణుచిత్తులవారు గోదా ఒక కారణ జన్మురాలని గమనించి, నీవు మమ్మల్ని కాపాడటానికి వచ్చినావమ్మా అంటూ ఆండాళ్ అని పిలవటం మోదలుపెట్టాడు. ఆండాళ్ అంటే కాపాడటానికి వచ్చినది అని అర్థం. అప్పటినుండి ప్రతిరోజు ఆండాళ్ దరించిన తులసిమాలనే స్వామికి సమర్పించేవాడు.
గోదాదేవికి పెళ్ళి వయసు రాగానే తండ్రి వరునికై చింతించెను, కాని ఆమె కృష్ణున్ని మాత్రమే వివాహమాడుతానని పంతంతో చెప్పెను. కాని తండ్రి గారు కృష్ణుడు ఉండేది ద్వాపరంలో నందగోకులమనే ప్రాంతము అని అది చాలదూరము, కాలము కూడా వేరు అని చెప్పెను. తాను కృష్ణుడిని కేవలం అర్చామూర్తిగానే చూడవచ్చని చెప్పెను. తండ్రిగారు వివిద దివ్యక్షేత్రాలలోని ఆయా మూర్తుల కళ్యాణగుణగణాలను కీర్తించెను, తద్వారా గోదాదేవి శ్రీరంగం లో వేంచేసి ఉన్న రంగనాయకులని వరునిగా తలచెను. శ్రీరంగనాథున్ని వివాహమాడుటకై తాను “తిరుప్పావై” మరియు “నాచియార్ తిరుమొఱ్ఱి” అనే దివ్యప్రభందాలను పాడెను.
గోదా కళ్యాణం
విష్ణుచిత్తులవారికి శ్రీరంగనాథులవారు మల్లీ స్వప్నంలో కనిపించి, నీ కుమర్తెను తనకిచ్చి వివాహం చేయటానికి చింతించవద్దని చెప్పెను, ఆమె ఎవరో కాదు భూదేవేనని చెప్పెను. అదేవిదముగా శ్రీరంగంలోని దేవాలయ పెద్దలకు కూడా స్వప్నంలో కనిపించి తన వివాహమునకై శ్రీవిల్లిపుత్తుర్ నుండి గోదాదేవిని పల్లకీలో తెమ్మని చెప్పెను. తద్వార రాజు వల్లభ దేవుని తో పాటు అందరు కలిసి గోదాదేవిని రంగనాథుని వద్దకు తెచ్చిరి, ఆమె ఆ రంగనాథున్ని వివాహమాడి సన్నిధిలో కలిసిపోయినది.
తిరుప్పావై వ్రత పూర్వరంగం
ఇక గోదా దేవి ఈ వ్రతం ఎలా అచరించినదో తెలుసుకుందాం. ఈవ్రతం ముప్పై పాటల వ్రతం. శ్రీకృష్ణ ప్రేమతో శ్రీకృష్ణున్ని చేరాలని తంఢ్రిగారి ఆదేషంతో గోపికలు చేసిన వ్రతమును తనూ పాటించినది. తాను ఒక గోపికగా భావించి, శ్రీవెల్లిపుత్తురును నందగోకులంగా భావించింది. వటపత్రశాయి దేవాలయంలోని మూర్తినే శ్రీకృష్ణునిగా భావించినది. ఆ నందగోకులం భగవంతుడు తన స్తానంగా ఎంచుకొన్న ప్రాంతం. ఈలోకాన్ని రక్షించేందుకు తాను ద్వాపర అంతంలో యమునాతీరంలో మధురా నగరంలో పుట్టి, తనదైన లీలలతో యమునానది దాటి ఆవల ఉన్న నందగోకులంలో యశోద-నందులకు తనయుడిగా పెరగటం ప్రారంబించాడు.
తనచిలిపి చేష్టలతో అందరిని ఆకర్షించసాగాడు శ్రీకృష్ణపరమాత్మ. నందగోకులంలోని చిన్నపిల్లకు శ్రీకృష్ణుడంటే చాలా ప్రేమ, తనకూ ఆ గోపబాలురు గోపబాలికలు అంటే చాల ఇష్టం. పిల్లలు పెరిగే వయసు కావటంతో అతిశంఖతో గోకులంలోని పెద్దలు తమ ఆడపిల్లలని ఇంట్లో భందించివేసారు. వారికి శ్రీకృష్ణుడిని చూడలేక పోవటంతో విరహం కల్గున్తుంది, శ్రీకృష్ణుడికీ వారితో ఆడుకునే అవకాశం లేకుండా పోయింది. వారి అదృష్టమో ఎమో, నందగోకులంలో అనావృష్టి ఎర్పడింది.
అందరి జీవనాదారం గో సంపదే కదా, సరి అయిన వానలు ఆహారం లేక గోవులు చిక్కిపోయాయి, దానితో నందగోకులంలోనివారంతా చింతించసాగారు. పెద్దలద్వారా కత్యాయనీ వ్రతం ఆచరిస్తే వానలు కురుస్తాయని తెలుసుకున్నారు. ఆవ్రతం ఎలా అంటే గ్రామంలోని ఆడపిల్లలంతా యమునానదిలో స్నానంచేసి ఆచరించాలి. తమపెద్ద నందగోపుడే కావటంతో వ్రత పరికరాలకోసం ఆయన్ని అశ్రయించారు. నందగోపుడు దానికి శ్రీకృష్ణుడే సమర్థుడని చెప్పాడు. మొదట కొంచెం బెట్టు చేసినా, తనకూ గోపబాలికలతో కలిసే అవకాశం, గోపికలకూ శ్రీకృష్ణుడిని కలిసే అవకాశం రావటంతో, వారి పనికి అంగీకరించాడు శ్రీకృష్ణుడు.
గోపబాలికలనందరిని శ్రీకృష్ణుడి వద్ద వదిలి వెళ్ళారు. చీకటిపడటంతో శ్రీకృష్ణుడు తెల్లవారుజామున రమ్మని చెప్పి వారందరిని తమ తమ ఇల్లకు వెళ్ళమన్నాడు. తాను నీళాదేవి భవనంలోకి వెళ్ళి పోయాడు. గోపబాలికలందరూ తమ తమ ఇల్లకు చేరుకున్నారు. కొందరికి శ్రీకృష్ణుడిని తలచుకుంటూ నిద్ర పట్టలేదు, మరి కొందరికి శ్రీకృష్ణ మైకంతో నిద్రపొతున్నట్టుగా ఉన్నారు.
గోదాదేవి ఈసన్నివేషాన్ని తనచుట్టే ఊహించుకొని, తాను వ్రతం అచరించినది. మొదటి అయిదు పాటలలో మనం చేయబోయే వ్రతం గురించి తెలిపినది. తదుపరి పది పాటలలో కృష్ణ భక్తిలో నిమగ్ఞమైన గోపికలను లేపి గోష్టిలో చేర్చుతుంది. తదుపరి పదిహేను పాటలలో గోష్టితో చేరి భగవత్సన్నిదానాన్ని చేరుతుంది.

– Raghava Sastry

Leave a Reply