హైదరాబాద్: ఎంజీఎం ఆసుపత్రిలో 5 గంటలు కరెంట్ లేకపోవడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవని చెబుతున్న సీఎం, మంత్రులు ఎంజీఎం ఆసుపత్రిలో ఏకబిగిన 5 గంటలు కరెంటు లేక రోగులు అవస్ధలు పడిన వైనానికి, ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఆ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
నవజాత శిశువుల నుండి వృద్ధ రోగుల వరకు MGM ఆసుపత్రిలో 5 గంటల విద్యుత్ కోత ఏర్పడటం బాధాకరం.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించడం తప్ప, ఉన్న ఆసుపత్రులను కూడా నిర్వహించలేకపోయింది. కరెంటు కోతలు లేవని సీఎం, ఆయన మంత్రులు పదే పదే చెబుతున్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?