Suryaa.co.in

Andhra Pradesh

అవినాష్‌ ను ఎందుకు మార్చాలనుకుంటున్నారు?

-ఐదు రోజులకే వణుకు మొదలైందా?
-ప్రజలు నిజం గ్రహించారని అర్థమైందా?
-జగన్‌ సమాధానం చెప్పి తీరాలి
-కడప స్టీల్‌ ప్లాంటును అటకెక్కించారు
-జమ్మలమడుగు ప్రచారంలో షర్మిలారెడ్డి

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో కడప పార్లమెంటు అభ్యర్థి వైఎస్‌ షర్మిలారెడ్డి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె వెంట వివేకా కుమార్తె డాక్టర్‌ సునీతారెడ్డి ఉన్నారు. షర్మిల మాట్లాడుతూ కడపలో ప్రచారం మొదలుపెట్టి కేవలం ఐదు రోజులే అయింది..నా ప్రచారంతో వైసీపీలో వణుకు పుడుతోంది..అభ్యర్థి అవినాష్‌రెడ్డిని మార్చాలని చూస్తున్నారట..అవినాష్‌రెడ్డి హంతకుడు అని ప్రజలు


నమ్ముతున్నారు. ఆయనకు ఎందుకు సీటు ఇచ్చారు.. ఇప్పుడు ఎందుకు మార్చాలని చూస్తున్నారు? కడప ప్రజలకు జగన్‌ సమాధానం చెప్పా లని షర్మిల ప్రశ్నించారు. అవినాష్‌ ను జగన్‌ కాపాడుతున్నారు. ఆయన దోషి అని తెలిసినా సీబీఐ ఆయన వెంట్రుక కూడా పీకలేకపోయింది. సీబీఐ విచారణ చేద్దామని చెప్పి తర్వాత ఎందుకు వద్దన్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఐదురోజుల ప్రచారం తర్వాత వైసీపీలో వణుకు మొదలైంది… అవినాష్‌ను మారుస్తున్నారని తెలిసింది. అవినాష్‌ రెడ్డిని ఉంచినా, మార్చినా జగన్‌ మాత్రం కడప ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని తెలిపారు.

స్టీల్‌ ప్లాంటుకు దిక్కు లేదు…
ఇదే జమ్మలమడుగు క్యాంబెల్‌ ఆసుపత్రిలో పుట్టా..ఇది నా జన్మస్థలం. వైఎస్‌, వివేకా గొప్ప నాయకులు. మాతో ఎలా ఉన్నారో…ఈ ప్రజల కోసం కూడా అలా గే ఉన్నారు. వివేకం సార్‌ అని పిలిస్తే వెంటనే సమస్య పరిష్కారం దొరికేది. ఈ కడప జిల్లాకు స్టీల్‌ ప్లాంట్‌ తీసుకురావాలని వైఎస్‌ కలలు కన్నాడు. స్టీల్‌ ప్లాంట్‌ వస్తే లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయని అనుకున్నారు. ఆయన పోయాక ఆ ప్రాజెక్టును శంకుస్థాపన ప్రాజెక్టుగా మార్చారు. చంద్రబాబు ఒకసారి.. జగన్‌ రెండుసార్లు శంకుస్థాపనలు చేశారు. వైఎస్‌ఆర్‌ కలల ప్రాజెక్టుకే దిక్కు లేదా అని విమర్శించారు.

హంతకులకు శిక్ష పడాలి: డాక్టర్‌ సునీతారెడ్డి
వివేకా రాజకీయ అజాత శత్రువు. ఆయనకు ఎవరి మీద కోపం ఉండదు. పని కావాలి అంటే వెంట తీసుకువెళ్లేవాడు. ఇక్కడ నుంచి బయలుదేరే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైలు తెలుసు. అందులో ఎన్నోసార్లు ప్రయాణం చేశారు. అటువంటి మంచి మనిషిని దారుణంగా నరికి చంపారు. తల మీద 7 సార్లు గొడ్డలితో నరికారు. మా కుటుంబసభ్యులే చంపారు అని తెలిసి ఎంతో బాధపడ్డాం. ఆయన హత్య మా సొంత విషయం కాదు. కడప జిల్లా ప్రజల విషయం. శాంతి భద్రతల అంశం. హత్య ఎవరు చేశారో అందరికీ తెలుసు. నిందితులకు శిక్ష పడాలని పోరాటం చేస్తున్నాం. షర్మిల ఎంపీ అయితే ఢల్లీ వరకు మన వాయిస్‌ వినపడుతుందని అభ్యర్థించారు.

LEAVE A RESPONSE