Suryaa.co.in

Telangana

దుస్తులు చించి.. దుశ్శాసన పర్వమా? సిగ్గుచేటు!

– వన్యప్రాణుల రోదనలు మీకు వినిపించడం లేదా రాహుల్?
– యూనివర్సిటీలో ఫుట్‌బాల్ ఆడి మరీ అక్కడున్న భూములపైన కన్ను వేశాడు
– విక్రమార్క, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు ఈ అంశంలో ఎందుకు మాట్లాడట్లేదు?
– హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులతో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం పాటుపడుతున్న విద్యార్థుల పై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన అణచివేత కి పాల్పడుతున్నుదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు కేటీఆర్ ని తెలంగాణ భవన్లో కలిశారు. వారి పోరాటానికి అండగా ఉంటామని తెలిపిన కేటీఆర్, ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాల ఫలమే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. తొలి దశ తెలంగాణ ఉద్యమం తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాలక్రమంలో అనేక పేరు ప్రఖ్యాతలు సాధించుకుంది. అక్కడ చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో గొప్ప సేవ చేస్తున్నారు.

దేశానికి తలమానికంగా ఉన్న విద్యాసంస్థల్లో ఒకటిగా ఉన్నది. విద్యార్థులు ఎలాంటి స్వార్థం లేకుండా సమాజ హితం కోసం చేస్తున్న గొప్ప పోరాటం ఇది. హైదరాబాద్ నగర భవిష్యత్తు కోసం విశ్వవిద్యాలయ భవిష్యత్తు కోసం పడుతున్న ఆరాటం చాలా గొప్పది.

ఈమధ్య కొత్త తరం పిల్లల్లో విద్యార్థుల్లో పోరాట స్ఫూర్తి తగ్గిందని అప్పుడప్పుడు బాధపడతాం. కానీ ఇలాంటి సరైన సందర్భంలో యూనివర్సిటీ విద్యార్థులు చూపెడుతున్న తెగువ, వారి పోరాటానికి సెల్యూట్ చేస్తున్నాం. ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా కొన్ని ప్రశ్నలను విద్యార్థుల తరఫున పార్టీ తరఫున అడుగుతున్నాము.

రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ విద్యార్థులపైన యూనివర్సిటీ భూములపైన రాజకీయం చేస్తున్నది. వందల బుల్డోజర్లను, హిటాచి యంత్రాలను పెట్టి అక్కడున్న చెట్లను, జంతువులను, చంపిమరీ వేగంగా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నది ఎందుకు ఇంత వేగంగా భూముల కబ్జాకు ఆరాటపడుతున్నదో చెప్పాలి.

గచ్చిబౌలి నానక్‌రామ్‌గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో నగరం విస్తృతంగా పెరిగింది. ఒక కాంక్రీట్ జంగల్‌గా మారింది. దేశంలోని ఏ నగరంలో అంత తక్కువ విస్తీర్ణంలో భారీగా నగరం అభివృద్ధి చెందలేదు. కోట్లాది చదరపు అడుగుల నివాస గృహాలు నిర్మాణం అవుతున్నాయి.

పశ్చిమ హైదరాబాద్‌కి ఊపిరి నిచ్చే కొన్ని గ్రీన్ ప్రాంతాలలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మరియు దాని చుట్టూ ఉన్న ప్రాంతాలే. పశ్చిమ హైదరాబాదులో భవిష్యత్తులో ఢిల్లీ మాదిరి ఊపిరి పీల్చుకోవడమే కష్టం అయ్యే పరిస్థితి ఏర్పడుతున్నది. సెంట్రల్ యూనివర్సిటీ చుట్టూ ఉన్న హరితాన్ని అలాగే ఉంచితే భవిష్యత్తుకు కొంత భరోసా ఉంటుంది.

ఒక ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేయకుండా ఏ విధంగా ఈ 400 ఎకరాలు అమ్ముతారని విద్యార్థులు అడుగుతున్నారు. ఈ 400 ఎకరాలను అమ్మేముందు జరిగే పర్యావరణ నష్టం ప్రభావం పైన అధ్యయనం చేయాలి అని అడుగుతున్నారు. 2003లో ఐఎంజీ భారత అనే కంపెనీకి, క్రీడా సదుపాయాల కోసం ఈ 400 ఎకరాలను కేటాయించింది.

కేవలం స్టేడియాలు క్రీడా శిక్షణకు సంబంధించిన మౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వాలు భూములను ఆ సంస్థకు ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం అదే ప్రాంతంలో 400 ఎకరాలలో కోట్లాది చదరపు అడుగుల నిర్మాణాలు చేపట్టి కాంక్రీట్ జంగల్‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నది.

మున్నా 21 సంవత్సరాల తర్వాత కేసు తేలింది. కానీ ప్రభుత్వం మాత్రం వెంటనే ఆ భూములను అమ్మి 30 వేల కోట్ల రూపాయలను సేకరించాలని ప్రయత్నం చేస్తుంది. రేవంత్ రెడ్డి ఆస్తులు అమ్మడం అప్పులు తేవడం అనే ఎజెండాపైన ప్రజలు నిర్ణయిస్తారు.

ఫ్యూచర్ సిటీ 50 వేల ఎకరాలలో కడతామని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు. ఫార్మాసిటీ భూములతో పాటు మరో 30 వేల ఎకరాలు సేకరించి నూతన నగరం కడతామంటున్నారు. ఇప్పటికే వేల ఎకరాల భూమి మీకు అందుబాటులో ఉన్నప్పుడు, 45 వేల ఎకరాలను అమ్ముకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు.

45000 ఎకరాలు ప్రభుత్వానికి అందుబాటులో వచ్చే ఈ తరుణంలో 400 ఎకరాలపైన ఎందుకు ఇంత దారుణంగా దాష్టీకంగా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అడ్డమొచ్చిన విద్యార్థులను ఆడబిడ్డలను లాగి పడేసి దుస్తులను చించి మరీ దుశ్శాసనుడి మాదిరి వ్యవహరించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెగబడుతున్నది.

రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్నలు

అక్కడ బుల్డోజర్లు చేస్తున్న కార్యక్రమాలకు ఉన్నవన్నీ ప్రాణులు అరుస్తున్న విజువల్స్ మీకు కనిపిస్తలేదా రాహుల్ గాంధీ? హైకోర్టులో ఇప్పటికే ఈ అంశంపైన పర్యావరణహితం కోసం ప్రజా ప్రయోజన రాజ్యం వేయడం జరిగింది.

అయితే ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల కన్నా ముందే అరాచకంగా వ్యవహరిస్తున్నది. ఎందుకు రాహుల్ గాంధీ స్పందించడం లేదు? గతంలో రాహుల్ గాంధీ సెంట్రల్ యూనివర్సిటీకి రెండుసార్లు వచ్చి వెళ్లారు. మరీ అలాంటిది విద్యార్థులపైన ఇన్ని అరాచకాలు జరుగుతున్న పర్యావరణంపైన ఇంత అక్రమంగా తమ సొంత ప్రభుత్వం వ్యవహరిస్తున్న ఎందుకు స్పందించడం లేదు?

ఇదే రాహుల్ గాంధీ గతంలో ముంబై ఆరాయి అడవులపైన జాతీయస్థాయిలో మాట్లాడారు. ఇదే రాహుల్ గాంధీ ఛత్తీస్‌గఢ్‌లో హస్దేయో అడవులను ఇతరులకు కేటాయించకుండా మాట్లాడారు. ఇలాంటి రాహుల్ గాంధీ ఈ రోజు హైదరాబాద్ నుండి భవిష్యత్తును పిల్లల భవిష్యత్తును రాష్ట్ర ప్రభుత్వం పణంగా పెడుతుంటే మౌనంగా ఉన్నారు.

అధికారంలోకి వచ్చిన మీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండాల్సిన అవసరం లేదా? రాహుల్ గాంధీ ఆలోచించాలి.కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూములపైన చేస్తున్న రాజకీయం వలన ఇబ్బందులు పడుతున్న పిల్లలు ,పర్యావరణం, వన్యప్రాణుల రోదనలు మీకు వినిపించడం లేదా రాహుల్ గాంధీ అని ప్రశ్నించారు.

విద్యార్థులకు మా పార్టీ తరఫున భరోసా ఇచ్చాము. పార్టీ తరఫున మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అడుగుతాము. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందే రియల్ ఎస్టేట్ అంటే.. నేను రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ అని మాట చెప్పినాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫుట్‌బాల్ ఆడి మరీ అక్కడున్న భూములపైన కన్ను వేశాడు.

అందుకే పిల్లలు, పర్యావరణం, సెంట్రల్ యూనివర్సిటీ ఏమైనా సరే ఆ భూములు వదిలిపెట్టనని ఈ రోజు అరాచకంగా వ్యవహరిస్తున్నారు. మా పార్టీ తరఫున సెంట్రల్ యూనివర్సిటీకి రావాలని అనేకమంది అడుగుతున్నారు. విద్యార్థుల ఆందోళనను రాజకీయ అభివృద్ధి చేస్తాడు అందుకే మా పార్టీ తరఫున ఇప్పటిదాకా నేరుగా పోలేదు.

సరైన వేదికలపైన ఈ అంశాన్ని లేవనెత్తుతాము. పార్లమెంట్ రాజ్యసభలో మా పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని హామీ ఇచ్చాము. ప్రజాక్షేత్రంలో కూడా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుంటే భవిష్యత్ తరాలకు స్మశానాలకు కూడా జాగాలు ఉండవు అంటూ చెప్పింది రేవంత్ రెడ్డి కాదా… మరీ ఇప్పుడు అవన్నీ రేవంత్ రెడ్డి మర్చిపోయాడు.

పిల్లలు ఇద్దరు యూనివర్సిటీ పిల్లలను అరెస్టు చేశారని… జైలుకి పంపించారని చెబుతున్నారు. వారికి అండగా ఉంటాము. వాళ్లకి న్యాయపరంగా అన్ని రకాల సహకారం అందిస్తాము. ఆ ఇద్దరు విద్యార్థుల ఆచూకీని వెంటనే రాష్ట్రప్రభుత్వం బయటపెట్టాలి మేరకు డీజీపీని విజ్ఞప్తి చేస్తున్నాం.

వైస్ ఛాన్సలర్ అనుమతులు లేకుండా పోలీసులు వెళ్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోకి వెళ్లే పోలీసులకు ఉండదు. కానీ విచ్చలవిడిగా పోలీసులను పంపించి విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. విద్యార్థినులను కూడా ఇబ్బందులు పెడుతున్నారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మాజీ విద్యార్థులైన విక్రమార్క, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు ఈ అంశంలో ఎందుకు మాట్లాడట్లేదు? వారికి పిల్లల తరఫున నిలబడేందుకు మనసు రావడం లేదు. ఈ అంశంలో అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నాము… బిజెపితో పాటు ఇతర పార్టీలను కూడా డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A RESPONSE