సోము వీర్రాజు అభ్యర్థిత్వం అధిష్టానం, కార్యకర్తల అభిప్రాయం. రాష్ట్రంలో విశ్లేషకుల పేరుతో రకరకాల డిబేట్లు పెట్టి వీరు ఏదో టిడిపికి, చంద్రబాబుకు వ్యతిరేకమని జగన్ అనుకూలమని లేని వ్యాఖ్యానాలు చేస్తున్నారు. బీజేపీ రాజకీయ ఆలోచన తెలియని కొంత మంది అనలిస్టులు, విశ్లేషకులు వారికి తోచిన విధంగా మాట్లాడుతున్నారు.. వారి హక్కు వారు మాట్లాడుకోవచ్చు కానీ వాస్తవాలు లోకి వస్తే..
సోము వీర్రాజు కరడుగట్టిన బిజెపి నాయకుడనే విషయంలో ఎవరికీ ఎలాంటి రెండో ఆలోచన లేదు. అధిష్టానం నిర్ణయాన్ని బిజెపిలో ఏ కార్యకర్త రెండో ఆలోచన చేయరు. అధిష్టానం ఒక నిర్ణయం చేసిందంటే, చాలా ఆలోచన చేసి, పార్టీకి ఉపయోగపడేటట్టుగా చేస్తుందనేదాంట్లో రాజకీయాలు తెలిసిన వారికే తెలుసు.
గతంలో వారు ఎమ్మెల్సీగా, రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు వారి స్టేట్మెంట్స్, ఉపన్యాసాలు టిడిపికి వ్యతిరేకంగా ఉన్నాయని.. అవి జగన్ కు అనుకూలిస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ వారు బిజెపి అధ్యక్షులనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతుంటారు. పార్టీని తనకున్న శక్తి మేరకు ఏ విధంగా ప్రజల్లో ఉంచాలో, బలం పెంచుకోవాలో ఎవరి ఆలోచనలు వారికుంటాయి.
టిడిపి పార్టీ మొన్న జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి, జనసేన ఒక అభ్యర్థికి సపోర్ట్ చేస్తే (వారు కమ్యూనిస్టు బ్యాగ్రౌండ్ ఉండే అభ్యర్థి) బిజెపి మరొక అభ్యర్థికి సపోర్ట్ చేసి గెలిపించింది.
ప్రస్తుతం జరుగుతున్న 5 ఎమ్మెల్సీ అభ్యర్థుల నిర్ణయానికి.. రాష్ట్ర బిజెపి పార్టీని సంప్రదించినట్టుగా కానీ, చర్చలు జరిపినట్టుగా గాని ఎక్కడా ప్రజానీకానికి తెలియలేదు. ఒకవేళ కలిసి మాట్లాడుకున్నా అది ప్రచారంలోకి రాలేదు ఎన్డీఏ కూటమి అనుకున్నప్పుడు మూడు పార్టీలు కూర్చుని మాట్లాడుకోవడం అనేది పరిపాటి. ఈ రకంగా జరగలేదని రాష్ట్ర ప్రజల అభిప్రాయం.
దేశం మొత్తం శరవేగంగా విస్తరిస్తున్న బీజేపీ.. రాష్ట్రంలో కూడా అందుకు తగ్గట్టుగా విస్తరించాలని కోరిక కార్యకర్తలకు ఉంది. అధిష్టానానికి ఉంది. అవసరం రాష్ట్ర ప్రజలకు ఉంది.
2024 లో జరిగిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పార్టీ నుండి 5 మంది పార్లమెంటుకు,10 మంది అసెంబ్లీకి పోటీ చేశారు. సోము వీర్రాజు సొంత పార్లమెంట్లో పార్లమెంటు, అసెంబ్లీ సీటు ఇతర సామాజిక వర్గాల అభ్యర్థులు పోటీ చేస్తున్న, కార్యకర్తలు అడుగుతున్నా.. అంతా అధిష్టానం నిర్ణయమేనని జవాబు ఇచ్చిన నాయకుడు.
ఆ అభ్యర్థులలో సామాజిక వర్గాల వారీగా చూస్తే.. తక్కువ సామాజిక వర్గం ఉన్నవారికి ఎక్కువ సీట్లు రావడం, ఎక్కువ సామాజిక వర్గం వున్న వారికి అసలు సీటే లేకపోవడం మనం చూశాం . ఆ సామాజిక వర్గంలో బాధ, అసంతృప్తి ఉన్నప్పటికీ! అలాగని బిజెపి సానుభూతిపరులు, కార్యకర్తలు, నాయకులు ఎవరూ మాట్లాడరు. అధిష్టానం నిర్ణయానికి వదిలేస్తారు.
దేశం మొత్తం విస్తరిస్తున్న బీజేపీ రాష్ట్రంలో కూడా అందుకు తగ్గట్టుగా విస్తరించాలని కోరిక, అవసరం అధిష్టానానికి- రాష్ట్ర ప్రజలకు ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్లో బిజెపి వాయిస్ వినపడాలంటే.. దమ్మున్న నాయకుడు, సిద్ధాంతపటిమగలిగిన ఎవరికి వెరవని నాయకుడు కావలసిన అవసరం ఉందని అధిష్టానం నిర్ణయం చేసిందని ఎందుకు అనుకోరు? ఆలోచించండి!

బిజెపి రాష్ట్ర నాయకులు,
మొబైల్ నెంబర్ 7386128877