రాజమండ్రిలో భూమి బద్దలు కొట్టేలా ర్యాలీలు చేసుకోండి
ప్రశాంతంగా ఉన్న ఐటీ డిస్టర్బ్ కావొద్దు
చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్
ఏపీ రాజకీయాలతో తెలంగాణ రాజకీయాలకు ఏం సంబంధం? ఇక్కడ ర్యాలీలు ఎందుకు? ఏపీలో చేస్కోండి. రాజమండ్రిలో భూమి బద్దలు కొట్టేలా ర్యాలీలు చేసుకోండి. ఇక్కడ ఎవరు చేసినా ఊరుకునేది లేదు-మంత్రి కేటీఆర్. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం రెండు రాజకీయ పార్టీల అంశంలా ఉంది. నేను వైఎస్ జగన్, పవన్ కల్యాణ్, నారా లోకేష్ కు మిత్రున్ని. బాబు అంశం కోర్టులో ఉంది దీని గురించి మాకు అనవసరం.
లోకేష్ నాకు కాల్ చేసి ర్యాలీకి అనుమతి ఎందుకు ఇవ్వలేదు అని అడిగారు.ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగొద్దు.. ఎవరికి అనుమతి ఇవ్వం అని చెప్పాను.ఇది రెండు రాజకీయ పార్టీల ఘర్షణ. ప్రశాంతంగా ఉన్న ఐటీ డిస్టర్బ్ కావొద్దు