Suryaa.co.in

Telangana

పెట్టుబడులు తెచ్చిన కే టీ ఆర్ పై కేసు పెడతారా ?

– అందాల పోటీల్లో అసభ్యంగా ప్రవర్తించిన వారి పై కేసులు పెట్టరా ?
– అవమానం జరిగిన మెల్లా మేగీ సోనియాకు ఫిర్యాదు చేశారు
– రేసింగ్ కోసం విదీశీ సంస్థకు ఇచ్చిన డబ్బులు రికవరీ చేయాలి
– మాజీ మంత్రి వి .శ్రీనివాస్ గౌడ్ , మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ , ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

హైదరాబాద్‌: కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన గురించి పట్టింపు లేదు. కక్ష సాధింపు కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతిపక్షం ఏదైనా చెబితే పాలకపక్షం సూచన అనుకుని తమ లోపాలు సమీక్షించుకోవాలి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని వేధించడానికి పూర్తి సమయం వెచ్చిస్తోంది. కేసీఆర్ కుటుంబాన్ని వేధించడానికి పాలన ను పూర్తిగా పక్కన బెడుతున్నారు.

నయవంచన ,అబద్ధాలకు కాంగ్రెస్ కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఫార్ములా ఈ కార్ల రేసింగ్ లో ఎలాంటి అవినీతి జరగకున్నా కే టీ ఆర్ ను విచారణకు పిలిచారు. ఈ కేసు లో అవినీతి సొమ్ము ఎవరికీ ముట్టలేదు. పారదర్శకంగా డబ్బు బదిలీ ప్రక్రియ జరిగింది. అందాల పోటీలు జరిగాయి ,ఫార్ములా వన్ జరిగింది. ఏ పోటీలు ఎలా జరిగాయో లోకం చూసింది. అందాల పోటీలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఫార్ములా ఈ రేసింగ్ తో అమరరాజా బ్యాటెరీ సంస్థ తో పాటు ఏడెనిమిది కంపెనీలు పెట్టుబడులు వచ్చాయి.

26 పెద్ద పేరున్న కారు తయారీ సంస్థలు ఈ ఈవెంట్ లో పాల్గొన్నాయి. ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరగడానికి ఈ రేసింగ్ తోడ్పడింది. పెట్టుబడులు తెచ్చిన కే టీ ఆర్ పై కేసు పెడతారా ? అందాల పోటీల్లో అసభ్యంగా ప్రవర్తించిన వారి పై కేసులు పెట్టరా ? తెలంగాణ ప్రతిష్ట దెబ్బతీయడం తప్ప అందాల పోటీలతో ఏమైనా ఒరిగిందా ?

సోనియాకు అవమానం జరిగిన మెల్లా మేగీ కూడా ఫిర్యాదు చేశారు. అయినా అందాల పోటీల్లో అవమానాలు చేసిన వారిపై కేసులు పెట్టలేదు. ప్రభుత్వం లో ఓ పద్దతి ఉందా ? పాలన ఉందా ?

కే టీ ఆర్ ను మాటి మాటికీ ఎందుకు విచారణకు పిలుస్తున్నారు ? రోజూ అదే పనేనా కాంగ్రెస్ నేతలు. ఇండియా లో ఎందరో ప్రయత్నం చేసినా ఫార్ములా ఈ రేసింగ్ ఘనత తెలంగాణ కే దక్కింది. దమ్ముంటే ఫార్ములా ఈ కారు రేసింగ్ కోసం విదీశీ సంస్థకు ఇచ్చిన డబ్బులు రికవరీ చేయాలి. 40 కోట్లు ఎటూ పోలేదు. భద్రంగా ఉన్నాయి. తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని అర్థం చేసుకోవాలి. ఆ డబ్బులు వెనక్కి తీసుకోవాలని ఈ ప్రభుత్వం ఒక్కసారి అడగలేదు. భవిష్యత్ ఎలక్ట్రికల్ వెహికల్ దే అని నమ్మి కేటీఆర్ ఈ రేస్ నిర్వహించారు.

LEAVE A RESPONSE