– కళాశాలలో సమస్యలను ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకొచ్చిన విద్యార్థి సంఘాల నాయకులు
గుడివాడ : దేశంలోనే విశిష్టత కలిగిన డాక్టర్ గురురాజు ప్రభుత్వ హోమియో కళాశాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ ఏలూరు రోడ్డులోని డాక్టర్ గురురాజు ప్రభుత్వ హోమియో కళాశాలలోని సమస్యలను, విద్యార్థి సంఘాల నాయకులు ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకువచ్చారు. ముందుగా వసతుల లేమితో కళాశాలలో పిజి సీట్లు కోల్పోకుండా సహకరించిన ఎమ్మెల్యే రాముకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు.