పేదరికం లేని మంగళగిరిగా తీర్చిదిద్దుతా!

– కె.కొండూరు రచ్చబండలో యువనేత లోకేష్

కంఠంరాజు కొండూరు రచ్చబండ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ… ఈ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపిస్తే పేదరికం లేని మంగళగిరిగా తీర్చిదిద్దుతానని, రాష్ట్రం మొత్తం మంగళగిరివైపు చూసేలా అభివృద్ధి చేస్తానని యువనేత నారా లోకేష్ తెలిపారు. చంద్రబాబు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంగళగిరి నియోజకవర్గానికి పరిశ్రమలు రప్పించి యువతకు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

కె.కొండూరు గ్రామస్థులు లోకేష్ కు సమస్యలను విన్నవిస్తూ… తమ గ్రామ సమీపంలోని హైలెవల్ కెనాల్ పై ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలి, మహిళల స్వయం ఉపాధికి చర్యలు చేపట్టాలి, పొలాలకు వెళ్లే డొంక రోడ్లు నిర్మించాలి. ఎస్సీ కాలనీల్లొ రోడ్లు, శ్మశాన వాటిక ప్రహరీగోడ, కమ్యూనిటీ హాలు నిర్మాణం చేపట్టాలి, ఉన్నత చదువులు చదివిన యువతకు ఉద్యోగాలు కల్పించాలి, తాగునీటి సమస్య పరిష్కరించాలి, పేదలకు ఇళ్లస్థలాలతో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. అధికారంలోకి వచ్చాక గ్రామస్థులు తన దృష్టికి తెచ్చిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని యువనేత భరోసా ఇచ్చారు.

Leave a Reply