Suryaa.co.in

Andhra Pradesh

కదిరిలో గొడ్డలి కొని జగన్ చేతికి ఇచ్చి పంపిస్తారా ఏంది?

– చింపేయడానికి అది సాక్షి స్టుడియో కాదు.. అసెంబ్లీ
– పులివెందుల కథలు వినిపిస్తే అసెంబ్లీలో వినరు
– అధ్యక్షా అని రఘు రామ రాజును పిలిచే గుండె ధైర్యం వుందా అని కనుక్కో

గొడ్డలింటి ఆణిముత్యం అవినాష్ రెడ్డి గారికి, “పులివెందులకు ఉప ఎన్నిక కాదు.. దమ్ముంటే మంగళగిరి, కుప్పంలో ఉప ఎన్నిక నిర్వహించండి” అని డిమాండ్ చేస్తున్నావు. ఏమి..? అక్కడ అక్కయ్యలు ఇద్దరూ వచ్చి మళ్లీ నీ గొడ్డలి గురించి ఉమ్మేస్తారని భయపడుతున్నావా? పులివెందుల కూడా పోతే, నువ్వు రాజీనామా చెయ్యి. నేను కడప నుండి ఎంపీగా వెళ్లి ఢిల్లీలో పాదాలు పట్టుకొంటా అని జగన్ అడుగుతాడని భయమా?

“సూపర్ సిక్స్ పథకాలను రెఫరెండంగా తీసుకుని ఎన్నికలకు వెళ్దాం” అని అడిగావు. ఎలాగూ దాని మీద 2029లో ఉంటుంది. అంత తొందరెందుకు? ఇప్పుడు బటన్ నొక్కుడు మీద కట్టిన బొప్పి తడుముకొంటూ ఆస్వాదించండి.

“ప్రతిపక్షాన్ని గుర్తించి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి” అంటూ అడిగావు. మీ పార్టీకి ప్రజలు అంత సినిమాలేదని కూర్చోబెట్టారు. గుడి మెట్ల దగ్గర అడుకొంటున్నట్లు మీ అన్న అసెంబ్లీలో బ్యాచ్ పెట్టి, బిక్షం లెక్కన అడుక్కోవటానికి సిగ్గెయ్యటం లేదా?

“ప్రతిపక్ష హోదాతో జగన్ అసెంబ్లీకి వెళ్తే వాళ్లకు సినిమా కనబడుతుంది” అని అంటున్నావు. మీ అత్త కూతురు, నువ్వు కలిసి, కదిరిలో గొడ్డలి కొని, జగన్ చేతికి ఇచ్చి పంపిస్తారా ఏంది? చింపేయడానికి అది సాక్షి స్టుడియో కాదు. అది అసెంబ్లీ.. మన పకోడీగాడికి ఎన్ని స్క్రిప్ట్లు వ్రాసి ఇచ్చి పంపినా చూసి కూడా చదవలేడు. ట్రోలర్స్‌కు పండగ అవుతాడు. అవన్నీ పకోడీ పొట్లాలకు ఇవ్వల్సిందే.

“జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా కూటమి కుట్ర చేస్తోంది” అని ఆరోపించావు. వాళ్లేమన్నా గొడ్డలితో నరికేసి గుండెపోటు కథలు చెప్పారా, నువ్వూ.. నీ మరదలి మీడియాలోలా? అది జనం ఇచ్చేది.

“ప్రతిపక్ష హోదా ఇస్తే తాము అడిగే ప్రశ్నలకు భయపడే ఇవ్వడం లేదు” అని అన్నావు. మీ అన్న సీఎం అయినా.. 23 మందితో వచ్చిన చంద్రబాబును చూసి చలి జ్వరం తెచ్చుకొని, బూతు మందతో వ్యక్తిత్వ హననం చేశాడు. ఇప్పుడు వున్న 11 మందిలో మీ అన్నకు ఆసరాగా ఒక్క బూతుగాడు కూడా గెలవలేదు. మీ వాడి ప్రశ్నలకు అక్కడి నుండి ఎదురయ్యే ప్రశ్నలకు కూతురే మా బాబాయిని చంపేసింది అనే పులివెందుల కథలు వినిపిస్తే అసెంబ్లీలో వినరు. అధ్యక్షా అని రఘు రామ రాజును పిలిచే గుండె ధైర్యం వుందా అని కనుక్కో. తరువాత ఈయన ప్రశ్నల గురించి నువ్వు మురిసిపోదువు.

“ఉన్నది ఒకే ప్రతిపక్షం.. 11 సీట్లు వచ్చాయన్నది ముఖ్యం కాదు” అన్నావు. నరికేసిన బాబాయి శవానికి కుట్లేస్తే గుండెపోటు వచ్చినట్లు భావిస్తారని, వెంటనే పాతేద్దామని శవపేటిక తెప్పించినంత సులువుకాదు. జనసేనకు కూడా మీకంటే ఎక్కువ సీట్లు వచ్చాయి. మీకు ఇవ్వాలని మీ తాత రాజ్యాంగంలో లేదు.

అయినా నువ్వు ఇలా మాట్లాడడం, అవతల మీ అక్కయ్యలు వచ్చి నీకు తలంటడం చాలా చాలా చాలా చాలా బావుంటుంది. ఊరికే వుంటే ఊరా పేరా? అవతల రెండు కేసులు గొడ్డలి కేసులో మొదలైంది. అది సీబీఐ దర్యాప్తు కాదు అవినాశనం. రాష్ట్ర పోలీసులు చేస్తున్నది. మనం అప్పుడు తెలంగాణా పంపేసిన అప్పటి దర్యాప్తు అధికారి మళ్లీ మన ఆంధ్రాకు వస్తున్నాడు. నీకు భయం వేసి, డైవర్షన్ కోసం అన్నకు అండగా నిలబడ్డావు. నీ కోసం బాబాయి కేసులో అండగా నిలబడిన రాక్షసత్వం మీ అన్నది. గొడ్డలింటి బ్రదర్స్ అనుబంధం, సంబంధాలు భలే వున్నాయి బ్రో.

– చైతన్య

LEAVE A RESPONSE