Suryaa.co.in

Telangana

డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు వైన్ షాపులు

హైదరాబాద్: డిసెంబర్ 31వ తేదీన మందుబాబులు.. మునుపటి మాదిరిగా ఉదయమే వైన్‌షాపుల వద్ద క్యూలు కట్టి మందు కొనుక్కోవలసిన పనిలేదు. ఎంచక్కా అర్థరాత్రి 12 గంటల దాకా వైన్‌షాపులో, బిందాస్‌గా వెళ్లి మందుకొనుక్కోవచ్చు. తెలంగాణ సర్కారు నూతన సంవత్సర కానుకగా మందుబాబులకు ఆ వెసులుబాటు కల్పించింది.

కొత్త సంవ‌త్స‌రానికి స్వాగ‌ తం ప‌లికేందుకు అంద‌రూ సిద్ధం అవుతున్నారు. న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ చేసుకు నేందుకు ఇప్ప‌టికే ప్ర‌ణాళి క‌ల‌ను సిద్ధం చేసుకున్నారు. ప్ర‌జ‌లు ప్ర‌తి ఏడాది ఆఖ‌రి రోజున చేసే హంగామా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇక మందుబాబుల గురించి చెప్పేది ఏముంది. మిగ‌తా రోజుల సంగ‌తి ఎలా ఉన్నా స‌రే.. ఆ రోజు మాత్రం గొం తులో మందు ప‌డాల్సిందే.

కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భం గా, తెలంగాణ ప్ర‌భుత్వం మందుబాబుల‌కు శుభవార్త అందించింది. డిసెంబర్ 31న తెలంగాణలో మద్యం షాపులను అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చని చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు అర్థ‌రాత్రి ఒంటి గంట వ‌ర‌కు తెర‌చుకోవ‌చ్చున‌ని తెలిపింది. ఈ విష‌యం తెలిసి మందుబాబులు తెగ ఖుషి అవుతున్నారు.

న్యూ ఇయర్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జ‌రిగే ఈవెంట్ల‌ను రాత్రి 1 గంట వ‌ర‌కే ప‌రిమితం చేసింది ప్ర‌భుత్వం. అదే స‌మ‌యం లో డ్ర‌గ్స్ పై ఉక్క‌పాదం మోపుతోంది. ఈవెంట్స్‌లో డ్ర‌గ్స్ వినియోగించ‌కుండా ఆంక్ష‌లు విధించింది. ఎవ‌రైనా డ్ర‌గ్స్ అమ్మినా, కొనుగోలు చేసినా, త‌మ ద‌గ్గ‌ర ఉంచుకున్నా క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని హెచ్చ‌రించింది.మ‌త్తు ప‌దార్థాల‌కు దూరంగా ఉండాల‌ని సూచించింది. ఇక గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ జీహెచ్ంఎసీ,ప‌రిధిలో జ‌రిగే ఈవెంట్స్‌, పార్టీల‌పై పోలీసులు ఓ కంట కనిపెట్టాలని,ఆదేశించింది.

LEAVE A RESPONSE