– హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే వారి కోసం 2,400 ప్రత్యేక బస్సులు
– రెగ్యులర్ ఛార్జీలే
హైదరాబాద్: ఏపీలో సంక్రాంతి పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే వారి కోసం 2,400 ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. జనవరి 9 నుంచి 13వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు లేవనీ, రెగ్యులర్ ఛార్జీలే ఉంటాయని స్పష్టం చేసింది. స్పెషల్ బస్సుల్ని ఎంజీబీఎస్కు ఎదురుగా ఉన్న పాత సీబీఎస్ గౌలిగూడ నుంచి నడిపించనున్నట్లు వివరించింది.