-కాళేశ్వరం ప్రాజెక్ట్ పగుళ్లు చూడడానికా?
-కుంగిన పిల్లర్లు చూడడానికా?
-చేసిన తప్పులకు క్షమాపణలు కోరడానికా?
-పొరక పెట్టి రాష్ట్ర ఖజానాను పూర్తిగా ఊడ్చేసిన బీ ఆర్ ఎస్ ప్రభుత్వం
-పదేళ్లలో పదింతలు అప్పులు పెంచిన బీ ఆర్ ఎస్ ప్రభుత్వం
-రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి ధ్వజం
-రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన చిన్నారెడ్డి
ఏ ముఖం పెట్టుకుని బి ఆర్ ఎస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి ప్రశ్నించారు. మహాత్మ జ్యోతిబాపూలే ప్రజా భవన్ లో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ గా డాక్టర్ జి చిన్నారెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో డాక్టర్ జి చిన్నారెడ్డి మాట్లాడుతూ కాలేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లే నైతిక హక్కు బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులకు లేదని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు ఎందుకు వెళ్తున్నారో బీ ఆర్ ఎస్ నాయకులు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కాలేశ్వరం ప్రాజెక్టు పగుళ్లు చూడడానికా..? కుంగిన పిల్లర్లు చూడడానికా..? ధ్వంసమైన ప్రాజెక్టును చూడడానికా..? లేదా చేసిన తప్పులకు క్షమాపణ కొరడానికా..? ఏ విషయం బి.ఆర్.ఎస్ నాయకులు తేల్చి చెప్పాలని చిన్నారెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను పొరక పెట్టి పూర్తిగా బీ ఆర్ ఎస్ ప్రభుత్వం ఊడ్చివేసిందని చిన్నారెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం సమయంలో రూ 70,000 కోట్ల అప్పులు ఉండగా.. బి ఆర్ ఎస్ ప్రభుత్వ పదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వ అప్పులు పదింతలు పెరిగాయని, ప్రస్తుతం ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని చిన్నారెడ్డి ఆరోపించారు.
గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం చేసిన పనుల పెండింగ్ బిల్స్ పూర్తి చేయాలంటే 40 వేల కోట్ల రూపాయలు అవసరం ఉంటుందని, ఈ పాపం బీ ఆర్ ఎస్ ప్రభుత్వానీదే అని చిన్నారెడ్డి పేర్కొన్నారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమం అవినీతిమయమేనని, నీటి పారుదల ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, గొర్రెలు, చేప పిల్లల పంపిణీ, దళిత బంధు వంటి ప్రతి కార్యక్రమంలో అవినీతి రాజ్యం ఏలిందని చిన్నారెడ్డి ఆరోపించారు.
నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం, ఉపాధి అవకాశాలు కల్పించడం రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చిన్నారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం 75 రోజుల్లోనే 30,000 పైచిలుకు ఉద్యోగాల నియామకాలను పూర్తి చేసిందని, అతి త్వరలోనే మిగతా ఉద్యోగాలను భర్తీ చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని చిన్నారెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు వివిధ అంశాలపై నైపుణ్య శిక్షణను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై ఉన్న నమ్మకంతో ప్రజావాణి అదనపు బాధ్యతలు అప్పగించారని చిన్నారెడ్డి తెలిపారు. ప్రణాళిక శాఖ ద్వారా వేదాంశలపై వివిధ అంశాలపై ప్రణాళికలు రూపొందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
వచ్చే పాలెం ట్రైన్ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపి జిల్లా మధ్యనే పోటీ ఉంటుందని, బీఆర్ఎస్ ఉనికి ఏమాత్రం ఉండదని చిన్నారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరుగారింటిల హామీలో నాలుగో గ్యారెంటీలు అమలులోకి వచ్చాయని త్వరలోనే మిగతా రెండు గ్యారెంటీలు అమలు చేస్తామని చిన్నారెడ్డి తెలిపారు.
సమావేశంలో ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, డాక్టర్ వంశీచంద్, వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజేంద్ర కుమార్ యాదవ్, డాక్టర్ ఆదిత్య రెడ్డి, తదితరులు పాల్గొన్నారు