– మరలా భూములు తీసుకునే అధికారం కమిషనర్ కు
– గతంలో ఢీ నోటిఫై లో మిగిలిన భూములు
రాజధాని అమరావతి పరిధిలో గతంలో భూసేకరణ ప్రకటన విడుదల చేసిన 343.36 సెంట్ల భూమికి గతంలో ఇచ్చిన సేకరణ నోటిఫికేషన్ రద్దు చేశారు. ఈ మేరకు పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
గతంలో సుమారు 1500 ఎకరాలకు సేకరణ నోటిఫికేషన్ జారీచేశారు. ఇందులో సుమారు 1200 ఎకరాలను గత వైసిపి ప్రభుత్వం డీనోటిఫై చేసింది. అప్పటికే రోడ్లు, ఇతర నిర్మాణాలు చేపట్టిన 343.36 ఎకరాలు అలాగే పెండింగ్లో ఉంది.
దీనిపై హైకోర్టులోనూ కేసులు నడుస్తున్నాయి. దీంతో అడ్వకేట్ జనరల్ సూచన మేరకు గతంలో నోటిఫికేషన్ కింద ఉన్న భూములను వాటి నుండి తొలగించేందుకు పాత నోటిఫికేషన్ ను రద్దు చేశారు. అదే సమయంలో కొత్తగా వాటిని తీసుకునేందుకు వీలుగా గుంటూరు జిల్లా కలెక్టరు దరఖాస్తు చేసుకోవాలని కమిషనరు అధికారాలిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
దీంతో 343.36 ఎకరాల భూమిని సేకరించి తమకు ఇవ్వాలని కోరుతూ సిఆర్ఏ కమిషనర్ గుంటూరు జిల్లా కలెక్టరు లేఖ రాయనున్నారు. దీని ఆధారంగా అవసరం అనుకుంటే కొత్త నోటిఫికేషన్ అమల్లోకి వస్తుంది. గతంలో వైసిపి ప్రభుత్వం డీనోటిఫై చేసిన సమయంలో అప్పటి అధికారులు తాము భూసేకరణ చేస్తామంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
దీనిపై భూ యజమానులు అప్పటికే కేసులు దాఖలు చేసి ఉండటంతో వారి సమాధానాలు కోరారు. దీనిపై సేకరణ ప్రకటన కింద ఉన్న భూముల యజమానులు హైకోర్టులో వారి సమాధానం దాఖలు చేశారు. తమ భూములు సేకరించుకుంటామంటే 11 ఏళ్ల నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. దీనిపై సిఆర్ డిఏ అధికారులను ప్రతిస్పందన కోరగా ఇప్పటి వరకూ సమాధానం ఇవ్వలేదు.
అలాగే న్యాయవాదులు యు.మురళీ వైసీపీ ప్రభుత్వం డీనోటిఫై చేసిన భూమిని సేకరణ పద్ధతిలో తీసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అది పెండింగ్లో వుంది. ఈ నేపథ్యంలో తాజా ఉత్తర్వులు విడుదల చేశారు. దీనిపై క్యాబినెట్లోను నిర్ణయం చేశారు.
– వల్లభనేని సురేష్
సీనియర్ జర్నలిస్ట్
9010099208