ఆ ముగ్గురిపై మహిళా పోరు

– పవన్-బాలయ్య లోకేష్‌పై వైసీపీ నారీ సమరం
– బలమైన అభ్యర్ధులు లేని ఫలితం

ముగ్గురు కీలక నేతలను సమర్ధవంతంగా ఎదుర్కొనే నేతలు లేకపోవడంతో వైసీపీ వారిపై మహిళా నేతలను బరిలోకి దించడం ఆసక్తికరంగా మారింది. జనసేన దళపతి పవన్ కల్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై మహిళలను పోటీకి దించాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించారు. దానితో సహజంగా ఆ మూడు నియోజకవర్గాలపై అందరి దృష్టి మళ్లింది.

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఎన్నికల్లో 175 మంది ఎమ్మెల్యేలు,25 మంది ఎంపీ అభ్యర్థులతో కూడిన జాబితాను వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. వైసీపీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో గుర్తించవలసిన కొన్ని అంశాలు ఉన్నాయి.ముగ్గురు మహిళా అభ్యర్థుల అభ్యర్థిత్వం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ముగ్గురు మహిళా అభ్యర్థులు మురుగుడు లావణ్య, వంగ గీత,దీపిక.. నారా లోకేష్,పవన్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణపై వైసీపీ నుండి పోటీ చేస్తున్నారు.

మంగళగిరి నుంచి లోకేశ్‌తో మురుగుడు లావణ్య, పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్‌తో వంగ గీత,హిందూపురం నుంచి బాలయ్యపై టీఎన్ దీపిక పోటీ చేయనున్నారు.

మురుగుడు లావణ్య,దీపిక బీసీ సామాజికవర్గానికి చెందిన వారు కాగా,వంగగీత పిఠాపురంలో కాపు సామాజికవర్గానికి చెందిన వారు.స్థానిక కుల సమీకరణాల ఆధారంగా ఈ ముగ్గురు అభ్యర్థుల ఎంపిక జరిగింది.2019లో ఇక్కడి నుంచి ఓడిపోయిన నారా లోకేష్‌కి మంగళగిరి ఎన్నికలు నిజంగా ప్రతిష్ఠాత్మకం కానున్నాయి.

ఈసారి మంగళగిరిని 50,000+ మెజారిటీతో గెలుస్తానని లోకేష్ తెలిపారు. హిందూపురంలో 1983 నుంచి టీడీపీకి గెలుపు ఆనవాయితీ ఉంది కాబట్టి, ఇక్కడ బాలయ్యను పై గెలవటం అంత ఈజీ కాదు. పిఠాపురం వచ్చిన వంగ గీత స్థానిక కుల సమీకరణాల కారణంగా, కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి , పిఠాపురంకు మారింది. తీవ్రమైన ఎన్నికల పోరులో ఆమె పవన్ కళ్యాణ్‌తో తలపడనుంది.

Leave a Reply