Suryaa.co.in

Andhra Pradesh

“గ్రామీణ భారత మహోత్సవం – ఆంధ్రప్రదేశ్ 2025” కు పోటెత్తిన మహిళలు

• ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్స్ మహిళలతో రద్దీ
• ఆదివారంతో ముగియనున్న గ్రామీణ భారత్ మహోత్సవం – ఆంధ్రప్రదేశ్ 2025
• ఇప్పటి వరకు రూ. 35 లక్షల ఆదాయం 10 వేల మంది సందర్శన
– నాబార్డు డీజీఎం మురారీ మోహన్ బెహ్రా

విజయవాడ: ఎంతో ప్రతిష్టాత్మక్మంగా ప్రారంభమైన “గ్రామీణ భారత మహోత్సవం – ఆంధ్రప్రదేశ్ 2025” ను ఈ నెల 14 న మేరిస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ప్రారంభించడం జరిగిందని నాబార్డు డీజీఎం మురారీ మోహన్ బెహ్రా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ భారతదేశ ఉత్పత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటైన ఈ ప్రదర్శన ను ఇప్పటి వరకు 10 వేల మంది సందర్శించగా వివిధ వస్తువుల కొనుగోళ్ల ద్వారా రూ. 35 లక్షల ఆదాయం వచ్చిందన్నారు..

నగర ప్రజలతోపాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారికి వివిధ రాష్ట్రాల నుంచి ఏర్పాటైన కళాఖండాలు, వస్త్రాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయన్నారు. దేశంలోనే వివిధ రాష్ట్రాల నుంచి నైపుణ్యం కలిగిన చేనేత మరియు హస్త కళాకారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన వస్తువులు ఇందులో ప్రదర్శిస్తున్నారన్నారు.. గ్రామీణ భారతదేశ అభివృద్ధి కోసం నాబార్డు చేస్తున్న సమగ్ర కృషిని నగర ప్రజలు మరింత ఆదరించాలన్నారు. ఈ రాష్ట్ర స్థాయి ప్రదర్శన ఈనెల 24 (ఆదివారం) తో ముగియనున్నదని నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రదర్శనలో రాష్ట్ర సాంప్రదాయ హస్తకళల్లో మంగళగిరి పట్టు, ఉప్పాడ, పొందూరు ఖద్దరు, తెలంగాణ ప్రత్యేకతలైన నారాయణపేట సిల్క్ & కాటన్ చీరలు ఉన్నాయన్నారు. అలాగే శ్రీకాకుళంలోని సిక్కోలు కాటన్ చీరలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయన్నారు. తిరుపతికి చెందిన బాలాజీ హస్త కళలు, ధర్మవరం పట్టు చీరలు, శ్రీ బాలాజీ కాటన్ సిల్క్, కొండపల్లి, ఏటికొప్పాక వంటి సంప్రదాయ కళాఖండాలతో పాటు, తమిళనాడు నుండి ప్రత్యేకంగా వచ్చిన నవసారిగై OFPO పట్టు చీరలు కూడా ఈ ప్రదర్శనలో ప్రాముఖ్యత సంతరించుకున్నాయన్నారు.

LEAVE A RESPONSE