– విజయవాడ ‘ఫిడ్జ్’ స్కూలుకు నోటీసులు
– ‘చైల్డ్ అబ్యూజ్’ పై అవగాహనకు పాఠశాలల్లో అమలయ్యే చర్యలేంటి..?
– విద్యాశాఖ వివరణ కోరిన ‘వాసిరెడ్డి పద్మ’
అమరావతి: ఎవరికీ చెప్పుకోలేక మరణమే శరణ్యమని నిర్ణయం తీసుకున్న విద్యార్ధిని దీక్షితగౌరి మానసిక వేదనను రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణిస్తుంది. చదువుతున్న బాలికల్లో మానసిక ధ్యైర్యాన్ని నింపేందుకు కౌన్సిలింగ్ ప్రక్రియను అమలు చేస్తున్నారా.. లేదా..అని సోమవారం మృతురాలు చదివిన విజయవాడ ఫిడ్జ్ స్కూలు యాజమాన్యానికి మహిళా కమిషన్ నోటీసు జారీ చేసింది.
అదేవిధంగా చిన్నారుల శరీర భాగాలను తాకడం వెనుక దురుద్దేశాలను పసిగట్టేందుకు వారికి తరగతి గదుల్లో అవగాహన చేయాల్సిన అంశాలకు సంబంధించి
ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల్లో ఇప్పటికే అమలవుతున్న చర్యలేంటని.. రాష్ర్ట విద్యాశాఖ మంత్రిత్వ కార్యాలయాన్ని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వివరణ కోరారు. బాలికలకు వివిధ అంశాలపై మానసికస్థైర్యం, ధైర్యం నింపేందుకు ప్రతీ పాఠశాలలోనూ కౌన్సిలర్ల నియామకం తప్పనిసరని… ఆ మేరకు చర్యలు చేపట్టాలని మహిళా కమిషన్ తరఫున సూచనలతో ఆదేశాలు జారీచేశారు.