– ఎమ్మెల్యే రాజశేఖర్
శ్రీశైలం: శ్రీశైలం దేవస్థానం సన్నిధిలో మల్లికార్జున స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన మహానాడు మీడియా అధినేత బోడేపూడి వెంకట సుబ్బారావు(బీఎస్ఆర్) శ్రీశైలం ఎమ్మెల్యే బి.రాజశేఖర్ రెడ్డి, ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బోడేపూడికి వారు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే రాజశేఖర్ మాట్లాడుతూ శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి పాలకమండలితో కలిసి భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు సమిష్టి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహానాడు మీడియా డైరెక్టర్ బోడేపూడి విగ్నేష్, వ్యాపారవేత్తలు గోరంట్ల సాంబశివరావు, కొల్లి రామారావు పాల్గొన్నారు.