బాబు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు

కదిరి నియోజకవర్గానికి చెందిన పలువురు ముస్లిం నేతలు, ఇతర సామాజిక వర్గాల నేతలు గురువారం టీడీపీలో చేరారు. వీరికి చంద్రబాబు నాయుడు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కదిరి పట్టణ వైసీపీ కన్వీనర్ బావుద్దీన్, కౌన్సిలర్లు కృష్ణప్ప, ఏం.ఎన్.ఫయాజ్, రంగారెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ ఎ.వెంకటరమణా రెడ్డి, సర్పంచ్ సి.సుధాకర్, వడ్డెర సంఘం ముఖ్య నాయకులు వల్లెపు సోమశేఖర్, పూసల సంఘం అధ్యక్షులు కుళ్లాయప్ప, నలుగురు వార్డ్ సభ్యులు, తదితరులు ఉన్నారు.

Leave a Reply