ధూళిపాళ్ల స్టిక్కర్ల సైకిల్ గుర్తింపు

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంలోని ఓ రైస్ మిల్లులో గురువారం ఎన్నికల అధికారులు తెలుగుదేశం అభ్యర్థి దూళిపాళ్ల నరేంద్ర కుమార్ స్టిక్కర్లు అంటించి ఉన్న 610 సైకిళ్లను గుర్తించారు. పొన్నూరు ఎంపీడీవో రత్నజ్యోతి సిబ్బందితో వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. తెదేపా నాయకులు సైకిళ్లను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచినట్లు సమాచారంపై అధికారులు విచారిస్తున్నారు.

Leave a Reply