– ఇదేనా మహిళల పట్ల కాంగ్రెస్ సంస్కారం?
– మహిళా లోకం మిమ్మల్ని క్షమించదు
– టీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి సునీతపై మంత్రుల వ్యాఖ్యలు ఖండించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్: భర్తను కోల్పోయిన ఏ మహిళ దుఖాన్ని కూడా ఎవరు ఆపలేరు. సమాజంలో ఆ మహిళలపై ప్రత్యేక సానుభూతి ఉంటుంది. ఆపుకోలేని దుఖాన్ని కూడా విమర్శిస్తున్న కాంగ్రెస్ మంత్రుల తీరు తీవ్ర ఆక్షేపణీయం. యావత్ మహిళా లోకం మిమ్మల్ని క్షమించదు.
మీ మాటలు ఒక సునీతమ్మకే కాదు. మీ అగ్రనేత సోనియమ్మ లాంటి వాళ్ళను కూడా మీరు విమర్శించినట్లు. భర్తలను కోల్పోయి తప్పనిసరి పరిస్థితుల్లో నమ్ముకున్న ప్రజల కోసం, దివంగత నేతల ఆశయాల సాధనల కోసం ప్రజాజీవితంలోకి వచ్చిన మాలాంటి వారికి ఇలాంటి వ్యాఖ్యలు ఎంతగానో బాధించాయి.
ఒక మహిళ తన భర్తను కోల్పోయి పడే బాధను చిన్నచూపు చూడటం, ఎటువంటి సంయమనం లేకుండా వ్యాఖ్యలు చేయడం విచారకరం. రాజకీయాలు వేరే విషయం – మానవీయత వేరే విషయం. రాష్ట్రంలో ఒక బాధ్యతమైన పదవిలో ఉండి సమాజానికి మీరు ఇచ్చే సందేశం ఇదేనా ? మానవత్వం ఉన్న మనిషిగా తమ బాధ్యతను గుర్తించాలి.
ఈ వ్యాఖ్యలు చేసినంత మాత్రాన గెలుపు లభించదు. గెలవలేకపోతున్నామనే మీ వేదన మాత్రం మీ మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. యావత్ మహిళా లోకానికి మీరు క్షమాపణలు చెప్పండి.