Suryaa.co.in

Andhra Pradesh

ప్రజాస్వామ్యాన్ని మీరే కాపాడాలి మేడమ్

– స్ధానిక సంస్ధల ఉపఎన్నికల్లో కూటమి పార్టీలు చేస్తున్న అరాచకాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసి ఫిర్యాదు చేసిన వైయస్సార్సీపీ ప్రతినిధుల బృందం.
– రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను కలిసిన వైయస్సార్సీపీ నేతలు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్టు, వైయస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌, కొమ్మూరి కనకారావు, అంకంరెడ్డి నారాయణమూర్తి

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను భయపెట్టడానికి వారి ఇళ్లను కూల్చివేయడంతో పాటు దాడులకు దిగిడం, పోలీసు వ్యవస్ధను అడ్డం పెట్టుకుని లాఠీల మాటున లూటీ చేస్తున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్ధానిక సంస్ధల ఉప ఎన్నికల్లో లెక్కకు మించి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయన్నారు.

పిడుగురాళ్లలో టీడీపీ గెలుపు ఎలాంటిదో అందరికీ తెలుసన్నారు. తునిలో కూటమి పార్టీలకు సరైన సంఖ్యాబలం లేకపోవడం వల్ల ఇప్పటికి రెండు దఫాలుగా వాయిదా పడిందని.. పాలకొండలో ఒకే ఒక ఎస్సీ సభ్యురాలు ఉంటే ఆమెను కూడా వారి పార్టీ తరపున నిలబెట్టే ప్రయత్నం చేయడం దారుణని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో ఇవాళ పాలకొండ, తుని, పిడుగురాళ్ల మూడు ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులమీద అధికార పార్టీ దౌర్జన్యాలు, కిడ్నాపులు చేస్తూ దమనకాండకు పాల్పడుతుందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు సజావుగా జరిపించాలని పదే, పదే రాష్ట్ర ఎన్నికల కమిషన్ తలుపు తడుతున్నా కూడా… స్ధానికంగా ఉన్న ఎస్పీ, కలెక్టర్, ఎన్నికల అధికార్లను సరైన దిశగా నడిపించడం లేదని మండిపడ్డారు.

కూటమి నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతుంటే అధికార్లు నిశ్చేష్టులై చూస్తున్నారని ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం ప్రకారం గెలుపోటములుంటాయని.. అలాంటికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెల్చిన వారిని కిడ్నాప్ చేసి వాళ్లతో పోటీ చేయించడం ఏ రకమైన ప్రజాస్వామ్యం అని నిలదీశారు. రాష్ట్రంలో గూండూ రాజ్యం నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలుపోటములు రాజకీయాల్లో సహజమని…కానీ ఈ తరహా దాడులు, అధికారుల ఏకపక్ష నిర్ణయాలు అన్నీ రికార్డెడ్ గా ఉంటాయన్న విషయాన్ని గుర్తించుకోవాలని హెచ్చరించారు.

స్థానిక సంస్ధల ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులను అన్యాయంగా, దౌర్జన్యంగా భయపెట్టి ఓట్లేయించుకుంటున్న టీడీపీ నేతల అకృత్యాలపై గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎన్నికల అధికార్లు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని వైయస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు.

రాష్ట్రంలో స్ధానిక సంస్ధల ఉపఎన్నిక ప్రక్రియ మొదలైన తర్వాత కూటమి పార్టీలు చేస్తున్న దౌర్జన్యాలపై ఎన్నికల కమిషన్ ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం నాలుగోసారి కలిసి ఫిర్యాదు చేశామని ఎమ్మెల్యీ లేల్ల అప్పిరెడ్డి తెలిపారు. అధికార పార్టీ ఆగడాలను, రాష్ట్రంలో జరుగుతున్న అప్రజాస్వామిక విధానాలను, వ్యవస్ధలను కాపాడాల్సిన అధికారులు చేష్టలుడిన చూస్తున్న వైనాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చామన్నారు.

LEAVE A RESPONSE