జగన్ కు మరో చెల్లి షాక్

– కాంగ్రెస్ పార్టీ గూటికి వివేకా కూతురు సునీత

ఏపీలో వైసీపీ చీఫ్, సీఎం జగన్ కు మరో చెల్లెలు షాక్ ఇవ్వబోతోంది. జగన్ సోదరి, వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలు అడుగు పెడుతున్నారు.

ఆమె త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు. షర్మిల పీసీసీ అధ్యక్షురాలుగా ఏపీలో చక్రం తిప్పబోతున్న సమయంలో సునీత కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవ్వాలనుకోవడం రాజకీవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తరువాత ఆమె కుమార్తె సునీతా రెడ్డి యాక్టివ్ అయ్యారు. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు కీలకమైన సమాచారం ఇచ్చారు. అంతేకాదు.. కోర్టుల్లో కేసుల్లో కూడా సునీత ఇంప్లీడ్ అయ్యారు. తన తండ్రిని చంపిన వారికి శిక్ష పడాలని న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఏపీలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి సునీత అడుగు పెట్టబోతున్నారు.

వైఎస్ జగన్ కు అపోజిట్ గా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇప్పటికే సోదరి షర్మిల ఏపీ పీసీసీ పగ్గాలు చేపట్టడంతో.. తాను కూడా ఆ పార్టీలోనే జాయిన్ అవ్వాలని సునీత నిర్ణయించారు.

Leave a Reply