Suryaa.co.in

Andhra Pradesh

డ్రగ్స్ కేసులో దొరికిపోయిన వైసీపీ ఎంపీ గన్‌మెన్

( భూమా బాబు)

గంజామామ గద్దె దిగినా… ఈ కానిస్టేబుల్ డ్రగ్స్ దందా మానలేదా? అదెలా సాధ్యం?!

గద్దె దిగినా ఆఫ్లైన్లో గంజామామ తన దందా ఆగకూడదనుకొన్నాడా? కానీ దెబ్బ మీద దెబ్బ పడుతోందా?

సరిగ్గా గంజామామ తన ముఠాకు మద్దతుగా తెనాలిలో హుక్కా కిక్కు లాంటి మాటలు వినిపిస్తున్నపుడే గుప్పుమంది మరో “శుభవార్త” భాగ్యనగరం నుండి.
“ఏపీలోని తిరుపతికి చెందిన ఓ ‘బుద్ధిమంతుడైన’ కానిస్టేబుల్ అట! బాపట్ల జిల్లా అద్దంకి నుంచి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి రెండు కోట్ల విలువైన డ్రగ్స్ తీసుకొస్తుండగా సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులకు దొరికాడు. పట్టుబడ్డ కానిస్టేబుల్ నుంచి 840 గ్రాముల కొకైన్, ఇతర డ్రగ్స్, ఇంకా నగదు స్వాధీనం చేసుకున్నారట!

ఈ ‘గొప్ప’ ముఠాలో తిరుపతికి చెందిన కానిస్టేబుల్ గుణశేఖర్ (40)తో పాటు, తిరుపతి రూరల్ ప్రాంతానికి చెందిన నిరుద్యోగి ఉన్నం సురేంద్ర (31), బాపట్ల జిల్లా కర్ల పాలెం మండలానికి చెందిన కాంట్రాక్టర్ దొంతి రెడ్డి హరిబాబు రెడ్డి (38), అద్దంకి మండలానికి చెందిన ఫాస్ట్ ఫియాడ్ నిర్వాహకురాలు చెగుడు మెర్సీ మార్గరేట్ (34), షేక్ మస్తాన్వలీ (40), దేవరాజు యేసుబాబు (29) ఉన్నారట!” అని విన్న అందరికీ షాక్ తగిలింది.

“అయ్యో! మన కానిస్టేబుల్ గుణశేఖర్… బుద్ధిగా పోలీసు డ్యూటీ చేసుకోక, ఇలా గంజామామ ముఠా ‘బిజినెస్’ ఎందుకు చేస్తున్నాడు? గంజామామ జగన్ గద్దె దిగాక కూడా ఎందుకు మానుకోలేదు?” అని అమాయకంగా గుసగుసలాడుకొన్నారు.

కానీ, అసలు ట్విస్ట్ అప్పుడే మొదలైంది! హైదరాబాద్‌లో ఈ గంజాయి దందాలో పట్టుబడింది ఎవరో తెలిసి గంజామామకు గుండె ఆగినంత పనైందట!
మన జగన్‌కు గతంలో పాదయాత్రలో ‘పిజియో థెరపీ సేవలు’ చేసి మెప్పించి, ఏకంగా తిరుపతి ఎంపీ టికెట్ దక్కించుకున్న వైసీపీ ఎంపీ గారి గన్‌మ్యాన్ అట! ఇతగాడే ఇప్పుడు హైదరాబాద్‌లో గంజాయి దందా చేస్తూ దొరికాడు!

దీంతో ‘గంజాయి మామ’ ఇప్పుడు ‘ఓదార్పు యాత్ర’ను హైదరాబాద్‌కు మారుస్తాడేమో అని సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి! అసలే గద్దె దిగి బాధలో ఉన్నాడు, ఈ ‘గంజా ముఠాల మీద దెబ్బ మీద దెబ్బ పడుతున్న వార్తలతో ఆ బాధ మరింత పెరుగుతుందేమో పాపం! ఏమైనా… గంజామామకు ఇప్పుడు నిజమైన ‘పీజీయో థెరపీ’ అవసరపడవచ్చు.

LEAVE A RESPONSE