ప్రమాదకర స్థితిలో పించా డ్యాం

– నాలుగు గేట్లు ఎత్తివేత
-డ్యాం పై నుంచే నీళ్ళు పోర్లే అవకాశం
-అన్నమయ్య ప్రాజెక్టు నుంచి దాదాపు లక్ష క్యూ సెక్కులు నీరు విడుదల
– లోతట్టు ప్రాంతాల వారికి పొంచి ఉన్న ప్రమాదం
భారీ వర్షాలు ప్రమాదాన్ని తెచ్చి పెట్టేలా ఉన్నాయి. పై ప్రాంతాల్లో భారీగా వర్షాలు కుుస్తుండడంతో ఫించా డ్యాం ప్రమాద స్థాయి లో ఉన్నట్లు సమాచారం. పించా డ్యాం నాలుగు గేట్లు ఎత్తివేశారు. అక్కడ రింగ్ బండ కు ఒక అడుగు తక్కువ ఎత్తులో మాత్రమే వరద నీరు ఉన్నట్లు తెలిసింది.
అందిన సమాచారం మేరకు ఒక గంటలో పింఛా డ్యాం ఓవర్ ఫ్లో అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. పింఛా డ్యాం అన్ని గేట్లు ఎత్తివే యడంతో అన్నమయ్య ప్రాజెక్టు కు అతి వేగంగా భారీ స్థాయిలో వరద నీరు వస్తుండటం తో అధికారులు అన్నమయ్య ప్రాజెక్టు నుంచి దిగువ ప్రాంతానికి దాదాపు లక్ష క్యూ సెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలిసింది. ఇందువల్ల ప్రాజెక్ట్ కు లోతట్టు ప్రతాలోనీ వారు ఈరోజు రాత్రి చాలా అప్రమత్తంగా ఉండాలి.
ఎందుకంటే పింఛా డ్యాం కు ఏదైనా ప్రమాదం జరిగితే అన్నమయ్య ప్రాజెక్టు ప్రమాదం అంచుకు చేరుకుంటుంది. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగే ప్రమాదం ఉంది. వర్షం భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో డేంజరస్ బెల్స్ మోగుతున్నాయి. కేర్ ఫుల్ గా ఉండక తప్పదు.

Leave a Reply